Illegal Affair: అక్రమ సంబంధం.. మెడలో చెప్పులు వేసి ఊరేగింపు

Illegal Affair: అక్రమ సంబంధం పెట్టుకున్న జంటకు ఆ పంచాయతీ పెద్దలు భారీ పనిష్మెంట్ ఇచ్చారు. రూ. 5 లక్షలు జరిమానా విధించడమే కాకుండా, మెడకు చెప్పుల దండ వేసి ఊరేగించారు.

news18-telugu
Updated: September 27, 2020, 2:53 PM IST
Illegal Affair: అక్రమ సంబంధం.. మెడలో చెప్పులు వేసి ఊరేగింపు
అక్రమ సంబంధం
  • Share this:
అనేక మంది వివాహేతర సంబంధాలతో చక్కని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. శారీరక సుఖం కోసం అయినవారిని సైతం అంతం చేసుకునే వరకు వెళ్లిన వారు కూడా ఉన్నారు. భార్యను చంపిన వారు కొందరైతే.. భర్తలను చంపిన వారు కూడా ఉన్నారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని కన్నవారిని కడతేర్చిన కసాయిలు సైతం ఉన్నారు. ఇలాంటి దారుణాలు నిత్యం ఎక్కడో చోట వింటూనే ఉన్నాం. అయితే అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ జంటపై ఓ గ్రామ పంచాయతీ పెద్దలు అత్యంత కఠినంగా వ్యవహరించారు. ఇలాంటి పనులు మరెవరైనా చేయాలంటేనే భయపడేలా ఆ జంటకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. అంతటితో ఆగకుండా రూ. 5 లక్షల భారీ జరిమానా విధించారు.

జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లోని జుహిబోనా గ్రామానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది. బకూరీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ మోడికోలాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇటీవల శివ పహాద్‌ ప్రాంతంలోని తన బంధువుల వద్దకు సదరు మహిళ వచ్చింది. ఈ క్రమంలో జుహిబోనా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడంది. అనంతరం కొద్ది రోజులకు ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రోజులు గడుస్తున్నా కొద్దీ వీరి వ్యవహారం శృతి మించింది. విషయం గ్రామ పెద్దల వరకు వెళ్లడంతో వారు సీరియస్ అయ్యారు. ఈ జంటను, వారి కుటుంబ సభ్యులను గ్రామపంచాయతీ కార్యాలయానికి పిలిపించారు. అనంతరం నిర్వహించిన పంచాయితీలో ఆ జంట తప్పుచేసినట్లు ఒప్పుకుంది.

భవిష్యత్ లో ఇలాంటి ఘటనలకు ఎవరూ పాల్పడకుండా ఉండేలా వారికి కఠినమైన శిక్ష విధించాలని పెద్దలు నిర్ణయించారు. దీంతో గ్రామ పంచాయతీ వారికి రూ.5 లక్షల భారీ జరిమానా విధించింది. అంతటితో ఆగకుండా వారికి చెప్పల దండను వేసి ఊరేగించాలని నిర్ణయించారు. పంచాయతీ ఆదేశం మేరకు సిబ్బంది ఆ జంటకు బలవంతంగా బూట్ల దండను వేశారు. అనంతరం గ్రామమంతా తిప్పారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ పంచాయతీ పెద్దలు మాట్లాడుతూ.. గ్రామంలో సంప్రదాయాలను, కట్టుబాట్లను అతిక్రమించకుండా చూడడం తమ ప్రధాన కర్తవ్యం అని స్పష్టం చేశారు. తమ పంచాయతీ పరిధిలో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇంతటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఈ ఘటన దృశ్యాలు, వీడియోలు వైరల్ కావడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో వారు అక్కడికి చేరుకుని ఆ జంటను అదుపులోకి తీసుకుని జరిమానా పడకుండా రక్షించారు.
Published by: Nikhil Kumar S
First published: September 27, 2020, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading