Home /News /crime /

HUBLI 25 YEAR OLD WOMAN COMMITS SUICIDE BEFORE MARRIAGE DUO TO FIANC HARASSMENT VB

డిసెంబర్ 2, 2021 పెళ్లి ముహూర్తం.. కాబోయే భర్త ఆమెతో ఆ ఒక్క మాట అన్నాడు.. ముగింపు ఊహించలేకపోయాడు..

పవిత్ర, అభినందన్ (ఫైల్)

పవిత్ర, అభినందన్ (ఫైల్)

Shocking Incident: పెళ్లికి ముందే ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటకలోని హ్యాపీనెస్ సిటీలోని అశోకనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబోయే భర్త వేధింపులతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  పెళ్లి అంటే చాలామందికి సంతోషం వేస్తుంది. ఆమెకు కూడా తన తల్లిదండ్రులు ఓ మంచి సంబంధం చూసి వివాహం నిశ్చయించారు. అతడితో ఆమె నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఇక ఆమె పెళ్లి గడియ కోసం వెయిట్ చేస్తోంది. వాళ్ల ముహూర్తం కూడా ఖరారు చేశారు. వాళ్ల పెళ్లికి ఇంకా దాదాపు 18 రోజుల సమయం ఉంది. ఆమెకు ఎన్నో ఆశలతో తనకు కాబోయే భర్తకు ఫోన్ చేస్తూ.. మాట్లాడింది. ఇలా నిశ్చితార్థం అయిన దగ్గర నుంచి వాళ్లిద్దరు బయట కలుసుకోవడం.. ఫోన్లో మాట్లాడం చేస్తుండేవారు. కాబోయే భార్యాభర్తలే కదా అని ఇద్దరు శారీరకంగా కూడా దగ్గర అయ్యారు. కానీ ఓ రోజు అతడు అన్న మాటలకు ఆమె తీవ్రంగా బాధపడింది. పెళ్లికి ముందే ఇలా వేధిచడంతో ఆమె ఆలోచనలో పడిపోయింది.

  OMG: ఏమోలే.. ఒకే ఊరు కదా అని మాట్లాడింది.. కానీ అతడు ఇలా చేస్తాడని ఊహించలేకపోయింది..


  ఇంట్లో చెప్పినా సమస్యకు పరిష్కారం చూపించలేదు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలాంటి వ్యక్తితో జీవితం పంచుకోవడం ఇష్టం లేక ఆ యువతి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన హుబ్లీ ప్రశాంత్‌నగర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 1న హవేరీకి చెందిన అభినందన్‌తో కర్ణాటకలోని హుబ్లీలోని సంతోషకు చెందిన మనోరన్ పవిత్ర (25)కు నిశ్చితార్థం జరిగింది. ఇరువర్గాలు త్వరలోనే పెళ్లి చేసేందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు.

  Bigg Boss: షాకింగ్.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్.. చివరకు ఏమైదంటే..


  డిసెంబర్‌ 2న ముహూర్తం ఖరారు చేశారు. ఆమెను గత వారం దండేలిలో ప్రీ వెడ్డింగ్ షూటింగ్‌కి ఇద్దరు కలిసి వెళ్లారు. ఆ రోజు అతడికి ఎందుకో పవిత్రపై అనుమానం పెరిగింది. ఆ రోజు నుంచే అతడు ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఈ విషయాలను పవిత్ర తన తల్లిదండ్రులకు చెప్పింది. పెళ్లి జరిగితే అన్నీ సర్దుకుంటాయని ఓదార్చారు. అయినా ఆమె వినలేదు. పెళ్లికి ముందే ఇలా తనను అనుమానించిన వాడు పెళ్లి తర్వాత అనుమానించడని గ్యారెంటీ ఎంటి అనే ఆలోచన.. సందేహం ఆమెకు మొదలైంది.

  Young Women: త్వరలో పెళ్లి చేసుకోబోయే 20 ఏళ్ల యువతిని.. వీళ్లు చేసిన పనికి.. ఇంత దూరం వచ్చింది..


  తీవ్ర వేదనకు గురైన పవిత్ర తన ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు అశోక్‌నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, అభినందన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Cirme, Crime news, Karnataka

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు