Black magic : అనారోగ్యానికి.. మంత్రాలు కారణం అవుతాయా..? స్వంత భార్యనే అనుమానించి భర్త..!

ప్రతీకాత్మక చిత్రం

Black magic : మంత్రాల నెపంతో స్వంత భార్యనే హతమార్చాడు..తాను కట్టుకున్న భార్యే తనను ఆనారోగ్యానికి గురిచేసిందని అనుమానించాడు. దీంతో భార్యపై కక్ష పెంచుకున్నాడు. కనీసం కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా కసాయివాడిగా మారాడు.

 • Share this:
  ఆధునిక సమాజంలో సాంకేతిక పరంగా ఎన్ని మార్పులు వస్తున్నా..పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా మూఢనమ్మాకల్లో మునిగి తేలుతున్నారు. సాంప్రదాయ ఆలోచనలను మనిషి వీడడం లేదు..లేని వాటిని వేల సంవత్సారాలుగా నమ్ముతున్న మనిషి..వాటి మాయలో పడి సమాజానికి మచ్చ తెస్తున్నారు. ముఢనమ్మకాలతో స్వంత వారినే కడతేరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది హంతకులుగా మారుతున్నారు.

  తాజాగా మంత్రాలు చేస్తుందని ఏకంగా తన భార్యపైనే అనుమానం పెంచుకున్నాడు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్సింగాపూర్‌లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ని సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్‌ అయిన లింగయ్య, లక్ష్మి దంపతులు. అయితే పెళ్లి తర్వాత చాలా రోజులు బాగానే ఉన్న లింగయ్య తన రిటైర్‌మెంట్ తర్వాత ఆయన ఆనారోగ్యం క్షిణించింది. దీనికి తోడు భార్యభర్తల మధ్య తరచు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో తనను ఆనారోగ్యం పాలు చేసేందుకు మంత్రాలు చేస్తుందని భార్యపై అనుమానాలు పెంచుకున్నాడు. తాను రోజు రోజుకు క్షీణించిపోతుండడంతో ఆమెపై బలంగా అనుమానాలు చెలరేగాయి. అనుమానం పెనుభూతంగా మారింది..దీంతో అది భార్యను తెగనరికి చంపాలనే స్థాయికి చేరింది. దీంతో నేడు ఉదయం ఇంట్లోనే భార్యను గొడ్డలితో తెగనరికాడు.అనంతరం తానే స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు.

  కట్టుకున్న భార్యను ఇలా చేయడంతో స్థానికంగా సంచలనం చెలరేగింది..  ఉద్యోగం చేసి పదవి విరమణ పొందిన తర్వాత కూడా తనకు శరీరంగా వచ్చే మార్పులను కూడా స్వంత భార్యపై నెట్టడం..ఆమెపై అనుమానం పెంచుకోవడం లాంటీ సంఘటనలు మానవ మనుగడను దెబ్బదీసే అవకాశాలు ఉంటాయి..ఇలాంటీ సంఘటనలు ఎక్కువగా గ్రామాల్లో జరుగుతున్నా అవి..తాజాగా పట్టణాల వరకు చేరడం ఆందోళన కల్గిస్తున్న అంశం..అయితే దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తే కాని ఇలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి.
  Published by:yveerash yveerash
  First published: