Home /News /crime /

Wife killing : అతి భక్తితో దారుణం... గుడికి వెళ్లి వచ్చిన భార్యపై భర్త దారుణం..

Wife killing : అతి భక్తితో దారుణం... గుడికి వెళ్లి వచ్చిన భార్యపై భర్త దారుణం..

Wife killing : అతి భక్తితో దారుణం... గుడికి వెళ్లి వచ్చిన భార్యపై భర్త దారుణం..

Wife killing : అతి భక్తితో దారుణం... గుడికి వెళ్లి వచ్చిన భార్యపై భర్త దారుణం..

Wife killing : అతిభక్తితో ఓ గృహిణి ఇంటిని పట్టించుకోవడం లేదని ఆ గృహిణి భర్త దారుణానికి ఒడిగట్టాడు.. ఇంటికంటే గుళ్లు,గోపురాలకే ఎక్కువ సమయం కేటాయిస్తుందనే కోపంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడిక్కడే సృహతప్పి చనిపోయిన పరిస్థితి నెలకొంది.

ఇంకా చదవండి ...
  భక్తి ( husband ) అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మహిళలే.. ఎక్కువగా అభద్రతా భావంతో పాటు తన ఇళ్లు పిల్లలతో పాటు భర్త సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె అవకాశం ఉన్న ప్రతి గుళ్లో పూజులు, వ్రతాలు చేస్తుంటుంది. అయితే తాజా ఆ భక్తే గృహిణి ప్రాణం తీసింది. భక్తి మాయలో పడి ఇంటిని పిల్లలను పట్టించుకోవడం లేదంటూ భర్త తీవ్ర కోపానికి గురైయ్యాడు. దీంతో అతిదారుణ సంఘటనకు పాల్పడ్డాడు.

  పోలీసులు వివరాల ప్రకారం... తమిళనాడు Tamilnadu రాజధాని చెన్నైలో నివాసముండే చంద్రమోహన్ కు సెల్వి తో 2011లో ( marriage )వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నాయి. అయినా... సెల్వీకి దైవభక్తి చాలా ఎక్కువ. కుటుంబాన్ని, ఇంటిని కూడా పట్టించుకోకుండా నిత్యం గుడులు, గోపురాలంటూ తిరుగుతూ వుండేది. ఈ విషయమై భార్యాభర్తలు మధ్య నిత్యం గొడవలు (altercation) జరుగుతుండేవి. అయినప్పటికి సెల్వి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

  ఇది చదవండి : గ్రేట్ సీఎం.. సాధారణ ప్రజలతోనే ప్రయాణం.. తన సెక్యూరిటిపై కూడా...!


  ఈ క్రమంలోనే భర్త చంద్రమోహన్ పిల్లలను పట్టించుకోవాలని ,గుళ్లకు ( temple ) వెళ్లడం వద్దని చెప్పినా గత గురువారం సెల్వ విళుపురంలోని ఓ ఆశ్రమానికి వెళ్లింది. ఓ రోజంతా ఆ ఆశ్రమంలోనే వుండి శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఆమె కోసం ఎదురుచూస్తూ ఇంట్లోనే వున్న భర్త, తాను వద్దన్నా ఎందుకెళ్లావంటూ నిలదీశాడు. దీంతో భార్యాభర్తల మద్య మరోసారి గొడవ చెలరేగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన భర్త కర్ర తీసుకుని భార్య పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.

  ఈ నేపథ్యంలోనే తీవ్ర గాయాలపాలైన భార్యను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. ఇక భర్త చేతిలో దాడికి గురయిన సెల్వి ఇంటి సమీపంలోని ఓ ఆలయంవద్దకు వెళ్లి స్పృహ కోల్పోయింది. రక్తపు మడుగులో పడివున్న ఆమెను గుర్తించిన స్థానికులు భర్త చంద్రమోహన్ కు సమాచారమిచ్చారు. దీంతో అతడు వెళ్లి భార్యను హాస్పిటల్ కు ( hospital ) తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు నిర్దారించారు.

  ఇది చదవండి : భారీ వర్షానికి కుప్పకూలిన గోడ.. ఒకే ఇంట్లో ఐదుగురు మృతి


  మృతురాలి కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన ఆమె భర్తను అరెస్ట్ ( arrest ) చేసారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి ప్రాణాలు కోల్పోవడం, తండ్రి జైలుపాలవడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime story, Tamilnadu

  తదుపరి వార్తలు