హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి కొండను ఢీకొట్టిన బస్సు.. డ్రైవర్ మృతి, 34 మందికి తీవ్ర గాయాలు..

ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి కొండను ఢీకొట్టిన బస్సు.. డ్రైవర్ మృతి, 34 మందికి తీవ్ర గాయాలు..

Road accident: హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి కొండ ప్రాంతాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 34 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Road Accident on Chandigarh Manali Highway:  చండీగఢ్-మనాలి రహాదారిపై ప్రయాణిస్తున్న బస్సు  ఒక్కసారిగా అదుపు తప్పింది. పక్కనే ఉన్న కొండ ప్రాంతాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో దాదాపు.. 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు భావిస్తున్నారు. సోమవారం మండి జిల్లాలో ఈ ఘటన జరిగింది. హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (HRTC) చెందిన బస్సు.. చండీగఢ్-మనాలి రహాదారిపై ప్రమాదానికి గురైంది.

దీంతో.. సంఘటన స్థలంలోనే బస్సు డ్రైవర్ మరణించగా, 34 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు మనాలి నుండి సిమ్లాకు వెళుతున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోనికి దిగారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు మండి ఎస్పీ షాలిని అగ్నిహోత్రి తెలిపారు.

మండిలో డ్రైవర్ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోవడంతో HRTC బస్సు ప్రమాదానికి గురైనట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోనికి దిగిన అధికారులు ట్రాఫిక్ ను అదుపులోకి తెస్తున్నారు.

Car Crushed Between 2 Trucks In Bhubaneswar: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భువనేశ్వర్ పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహాదారిపై ఆగి ఉన్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారు ఒక్కసారిగా తుక్కు తుక్కుగా మారిపోయింది. దీంతో రోడ్డు పైన ఉన్న ప్రయాణికులు పరుగులు పెట్టారు. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

పోలీసులు తెలిపిన వివరాలు.. భువనేశ్వర్ పరిధిలోని 16 వ నంబర్ జాతీయ రహాదారిపై కూడలి వద్ద సిగ్నల్ పడింది.  ఈ క్రమంలో.. ఒక లారీ ఆగింది. దాని వెనకాల.. మరొ 2 కార్లు ఆగాయి. అప్పుడు మరో లారీ వేగంగా వచ్చింది. అది ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. దాని వేగానికి ఆ కారు.. దాని ముందున్న కారును, లారీనీ కూడా ఢీకొట్టింది. మధ్యలో ఉన్న కారు అప్పడంలా మారిపోయింది. కారులోని డ్రైవర్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాహానాలు కటక్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా రోడ్డంతా భీతావాహాకంగా మారిపోయింది.

ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వెంటనే స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై వాహానాలు ఉండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అంబులెన్స్ లను రప్పించి, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. క్రెన్ లను రప్పించి వాహానాలను అక్కడి నుంచి వేరే చోటికి తీసుకెళ్లారు. ప్రమాదం జరగ్గానే లారీడ్రైవర్ పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.

First published:

Tags: Crime news, Himachal Pradesh, Road accident

ఉత్తమ కథలు