మీ ATM కార్డు మీ దగ్గరే ఉంటే... దొంగలు ఎలా మీ డబ్బు దోచేస్తున్నారు? తెలుసుకోండి

ATM : హ్యాకర్లు తెలివైన వాళ్లు. ఎలాగైనా మన డబ్బు దోచేయగలరు అనుకోవద్దు. వాళ్లకు అంత సీన్ లేదు. మనం వివరాలు చెప్పకపోతే... వాళ్లు చేయగలిగేది ఏమీ ఉండదు. మనం అలర్ట్‌గా ఉంటే హ్యాకర్ల ఆటలు సాగవ్.

Krishna Kumar N | news18-telugu
Updated: October 1, 2019, 11:32 AM IST
మీ ATM కార్డు మీ దగ్గరే ఉంటే... దొంగలు ఎలా మీ డబ్బు దోచేస్తున్నారు? తెలుసుకోండి
మీ ATM కార్డు మీ దగ్గరే ఉంటే... దొంగలు ఎలా మీ డబ్బు దోచేస్తున్నారు? తెలుసుకోండి
  • Share this:
ATM Cheating : తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు... ఇటీవల చాలా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఏయే సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో, వాటి ఉచ్చులో పడకుండా ప్రజలు ఎలా బయటపడాలో చెబుతున్నారు. డబ్బులు పోకుండా ఉండేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. తాజాగా ఏటీఎం కార్డుల మోసాలపై పోలీసులు కొన్ని వాస్తవాల్ని చెప్పారు. సాధారణంగా... ఏటీఎం కార్డులు మన దగ్గరే ఉంటాయి... కానీ... మన కార్డుతో హ్యాకర్లు మన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు దోచేస్తారు. ఇదెలా సాధ్యమన్న డౌట్ అందరికీ ఉంటుంది. ఇందులో ప్రధానంగా హ్యాకర్లు చేసేది ఒకటే. మనకే ఫోన్ చేసి... బ్యాంక్ నుంచీ కాల్ చేస్తున్నామని అంటారు. మన ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యిందనీ, దాన్ని అన్-బ్లాక్ చెయ్యడానికి కొన్ని వివరాలు చెప్పమని అంటారు. అలా మన కార్డు వివరాలు, మన పేరు, బర్త్ డే అన్ని వివరాలూ తెలుసుకొని... మన దగ్గరున్న కార్డు లాంటిది క్లోనింగ్ కార్డు తయారుచేస్తారు. ఆ తర్వాత దానితో డబ్బులు డ్రా చేస్తారు. ఇలా చేస్తే... బ్యాంకులు కూడా మనల్ని కాపాడటం కష్టం. పోలీసులు కూడా... హ్యాకర్లు ఎక్కడో విదేశాల్లో ఉండి ఈ నేరాలు చేస్తే... వాళ్లను పట్టుకోవడం కష్టం. అసలు ఇలా జరగకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే... ఏటీఎం కార్డుల మోసాల్లో చిక్కుకోకుండా తప్పించుకోవచ్చు.

పోలీసులు చెబుతున్న సూచనలు :

- ఎట్టిపరిస్థితుల్లో డెబిట్/క్రెడిట్ కార్డ్... రెస్టారెంట్లు, బార్లు, పెట్రోల్ బంకుల్లో "ప్రక్కకు తీసుకెళ్లి స్వైప్ చేస్తాం" అని అంటే ఒప్పుకోవద్దు. మీ ఎదురుగానే, మీరు చూస్తున్నప్పుడే స్వైప్ చెయ్యమని డిమాండ్ చెయ్యండి.

- మీకు మాత్రమే తెలిసి ఉండాల్సిన ATM పిన్ ఎవరికీ చెప్పకండి. రహస్యంగా ఉంచండి.

- ఎప్పుడైనా సరే... మీ కార్డ్‌ని మీ కళ్ళముందే స్వైప్ చేసేలా చూసుకోండి. తద్వారా మీ కార్డ్ వివరాల్ని ఎవరూ దొంగిలించకుండా ఉంటారు.

- కార్డ్‌పై ఉన్న 16 అంకెలు, గడువు తేదీ, కార్డ్ వెనుక ఉన్న 3 అంకెల CVV నెంబర్... అపరిచితుల కంట పడకుండా చూసుకోండి.

- వీలైతే CVV నెంబర్‌ని చెరిపేసి... మీరు మనసులో గుర్తుపెట్టుకోండి.- తరచూ ATM పిన్ (పాస్‌వర్డ్) మార్చుతూ ఉండండి. (కనీసం నెలకోసారి మార్చేయండి)

- ATM పిన్ (పాస్‌వర్డ్‌)ని 1234, 0022 లాంటి నంబర్లు కాకుండా... కష్టమైన నంబర్లు పెట్టుకోండి. అంటే... 5968, 4672, 9118 ఇలా కన్‌ఫ్యూజ్ నంబర్లు పెట్టుకోండి. అప్పుడు హ్యాకర్ల తిక్క కుదురుతుంది.
First published: October 1, 2019, 11:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading