హోమ్ /వార్తలు /క్రైమ్ /

గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తుల విలువ ఎంత? న్యూస్ 18 ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తుల విలువ ఎంత? న్యూస్ 18 ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

గ్యాంగ్‌స్టర్ నయీమ్(ఫైల్ ఫోటో)

గ్యాంగ్‌స్టర్ నయీమ్(ఫైల్ ఫోటో)

నయీం ఎన్‌కౌంటర్‌ జరిగి దాదాపు మూడేళ్లు కావస్తోంది. కేసు దర్యాప్తులో నయీం ఆస్తుల లెక్కల చిట్టా మాత్రం ఇంకా తేలలేదు. ఇప్పటివరకు పోలీసులు నగదు, ఆభరణాలు, ఆయుధాలు, డాక్యూమెంట్స్‌ భారీగా స్వాధీనం చేసుకున్నారు.

  నయీం కేసులో పోలీసులు సీజ్‌ చేసిన సొమ్మెంత ? బంగారమెంత ? నయీం డెన్‌లో దొరికిన పెన్‌ డ్రైవ్‌లు ఎన్ని ? అందులో ఏముంది ?నయీం అనుచరుల గాలింపు ఎంత వరకు వచ్చింది ? సీజ్ చేసిన వాటిని ఎక్కడ పెట్టారు? ఇలా అనేక ప్రశ్నలకు ఇప్పుడిప్పుడే సమాధానం లభిస్తుంది. నయీం ఎన్‌కౌంటర్ త‌రువాత అత‌ను సంపాధించ‌ని ఆస్తుల‌పై అప్ప‌ట్లో మీడియాలో అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. దీంతో పాటు పోలీసులు భారీ మొత్తం లో న‌యిం ఆస్తుల‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇన్ని ప్ర‌చారాల నేప‌థ్యంలో అస‌లు నయీం ఎంత సంపాధించాడు? పోలీసులు ఎంత మొత్తంలో స్వాదీనం చేసుకున్నారు అనే అంశంపై వాస్త‌వాలు వెలికి తీసే ప్ర‌య‌త్నం చేసింది న్యూస్ 18. దాదాగిరే ప్ర‌దాన ఆదాయంగా మార్చుకున్న నయీం ఎన్ని వెల కోట్లు సంపాధించాడో ఎక్స్లూజీవ్ గా అధికారిక లేక్క‌ల‌తో న్యూస్ 18 మీ ముందుంచే ప్ర‌య‌త్నం చేస్తోంది.


  నయీం ఎన్‌కౌంటర్‌ జరిగి దాదాపు మూడేళ్లు కావస్తోంది. కేసు దర్యాప్తులో నయీం ఆస్తుల లెక్కల చిట్టా మాత్రం ఇంకా తేలలేదు. ఇప్పటివరకు పోలీసులు  నగదు, ఆభరణాలు, ఆయుధాలు, డాక్యూమెంట్స్‌ భారీగా స్వాధీనం చేసుకున్నారు. వాటి వివరాలు చూస్తే... 252 విలువైన డాక్యుమెంట్లు తో పాటు రెండు కోట్ల 12 లక్షల రూపాయలకు పైగా నగదు, రెండు కిలోల బంగారం, రెండున్నర కిలోల వెండిని పోలీసులు సీజ్‌ చేశారు. ఆస్తులే కాదు... నయీం వాడిన ఆయుధాలను కూడా పోలీసులు సీజ్‌ చేశారు. 4 పిస్టోల్స్‌.227 బుల్లెట్స్‌ పోలీసులు సీజ్‌ చేసిన వాటిలో ఉన్నాయి. వీటితో పాటు జిలిటిన్‌ స్టిక్స్‌, ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లు కూడా ఉన్నాయి. 13హార్డ్‌ డిస్క్‌లు పోలీసులు సీజ్‌ చేసిన వాటిలో ఉన్నాయి. వీటితో పాటు ఖరీదైన లగ్జరీ కార్లతో పాటు ఆరు ద్విచక్రవాహనాలను కూడా పోలీసులు సీజ్‌ చేశారు.


  నయీం ఆస్తులపై పోలీసులు విడుదల చేసిన రిపోర్ట్


  మ‌రోక‌వైపు 32 పాస్‌ పుస్తకాలు,27 చెక్కు పుస్తకాలు,279 సిడీలు,241 సెల్‌ఫోన్లు,70 పెన్‌ డ్రైవ్స్‌,17 మెమోరీ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాదీనం చేసుకున్నా ఆయుధాలు, డాకుమెంట్స్, పెన్ డ్రైవ్ లు 7 పెట్టెల్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో భద్ర పరిచారు. ఇదిలా ఉంటే నయిమ్ బీనామీలపై ఉన్న స్థలాలపై కన్నేసిన లోకల్ లీడర్స్ ...వాటిని కబ్జా చేసే పనిలో పడ్డారు. నగర శివారులో నయిమ్ కు చెందిన విలువైన స్థలాలు పోలీసులు గుర్తించే లోపు ఆ స్థలాలు మాయం కావడం ఖాయంగా కనిపిస్తుంది.


  పెన్‌ డ్రైవ్స్‌లో ఏముంది ? హర్డ్‌డెస్క్‌లో ఉన్న సమాచారం ఏంటీ ? అన్న కోణంలో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు నయీం అనుచరుడు శేషన్న కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగి మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో కేసు దర్యాప్తులో కీలక సమాచారాన్ని మాత్రం పోలీసులు బయటపెట్టలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


  (బాల‌కృష్ణ‌,న్యూస్18తెలుగు, సీనియ‌ర్ క‌రెస్పాండెంట్)

  First published:

  Tags: Crime, Encounter, Telangana News

  ఉత్తమ కథలు