ఇంటర్నెట్‌లో టీచర్ నగ్న చిత్రాలు... ఎలా వచ్చాయ్?

Andhra Pradesh : అగ్ని సాక్షి, వేద మంత్రాల సాక్షి... ఇలా ఎన్ని సాక్ష్యాలతో పెళ్లి చేసుకున్నా... వెధవలు మారరు. వాళ్ల మైండ్ సెట్ అలాగే ఉంటుంది. అందుకు ఈ నేరమే ఉదాహరణ.

news18-telugu
Updated: December 8, 2019, 7:43 AM IST
ఇంటర్నెట్‌లో టీచర్ నగ్న చిత్రాలు... ఎలా వచ్చాయ్?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Andhra Pradesh : కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ టీచర్‌కి సంబంధించిన నగ్న చిత్రాలు తెగ షేరింగ్ అవుతున్నాయి. ఈ విషయం వైజాగ్‌లో కలకలం రేపింది. ఆ ఫొటోలు షేరింగ్ అవ్వడానికి కారణం తెలిశాక అందరూ ఆశ్చర్యపోయారు. అసలేమైందంటే... వైజాగ్‌లోని పాడేరులో బాధితురాలు ఓ టీచర్. 2018 ఆగస్టులో ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆ తర్వాత ఓ తాపీ మేస్త్రి ఆమె జీవితంలోకి వచ్చాడు. మొదట ఫ్రెండ్షిప్... తర్వాత ప్రేమ అన్నాడు. తోడు లేని జీవితం కష్టమనుకున్న ఆమె... అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. అలా వాళ్లిద్దరూ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో పద్ధతిగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు లేని పోని కండీషన్లు పెడుతుంటే... ఆమెకు చిరాకొచ్చింది. ఇద్దరి మధ్యా తేడా వచ్చింది. దాదాపు విడిపోయారు. ఆ తర్వాత... కొన్ని రోజులకు సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన అశ్లీల చిత్రాలు షేరింగ్ అయ్యాయి. అవి అటూ ఇటూ తిరిగి... ఆమె తోటి టీచర్లకు చేరాయి. షాకైన వాళ్లు ఆమెకు విషయం చెప్పారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమన్నారు. కానీ ఆమె అతనిపై కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. తన పరువు పోతుందని భయపడింది. కానీ... నగ్న ఫొటోలు నానాటికీ ఎక్కువైపోతుంటే... ఇక లాభం లేదనుకొని... ఓ టీచర్ ద్వారా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. మంత్రి మత్య్సరాస మణికుమారి కూడా దీనిపై స్పందించి... పోలీసులకు సంగతేంటో తేల్చేయాలని ఆదేశాలిచ్చారు. టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగింది. ఆధారాలు సేకరించింది. మొత్తం ఫొటోలు, వీడియోలన్నింటినీ అన్నిచోట్లా డిలీట్ చేసింది. కట్ చేస్తే... పోలీసుల ఆ పనికిమాలిన వాణ్ని అరెస్టు చెయ్యడానికి వెళ్లారు. పోలీసులపైనే రివర్సయ్యాడు. దాడి చేశాడు. అంతే... మరో కేసు కూడా నమోదైంది. ఇప్పుడు రెండు కేసుల్లో నిందితుడిగా జైల్లో ఊచల్ని లెక్కేసుకుంటున్నాడు.

రేపిస్టులకూ ఆ భర్తకూ తేడా ఏముంది? భార్య నగ్న చిత్రాల్ని నెట్‌లో పెట్టే వాళ్లను ఏమనాలి? అలాంటి దుర్మార్గులకు ఎలాంటి శిక్ష వెయ్యాలి? అసలు ఆమె జీవితంలోకి ఆ కేటుగాడు రాకుండా ఉండి ఉంటే... భర్త లేకపోయినా... తన బతుకేదో ఆమె బతికేది. ఇప్పుడామె పరిస్థితేంటి? ప్రతి రోజూ తోటి టీచర్ల ముందు ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి ఆమెకు ఎదురవుతుంది. అందుకే ఇలాంటి పనులు చేసేవాళ్లను కఠినంగా శిక్షించడంలో ఏమాత్రం తప్పులేదేమో.

 

Pics : కేరళ అందాలన్నీ తనలో దాచుకున్న బ్యూటీ దేవికా సంజయ్


ఇవి కూడా చదవండి :

నిత్యానంద వీడియో రిలీజ్... పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరిందిగా...IND VS WI : వెస్టిండీస్‌తో నేడు రెండో టీ20... గెలిస్తే సిరీస్ భారత్‌దే...

జరిగింది ఎన్‌కౌంటరేనా? NHRC ఏం చెప్పబోతోంది?

జగన్‌కి మేలుచేసిన కేసీఆర్... వైసీపీ హ్యాపీ

Health Tips : పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి
First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు