HOW A PERSON GOT A JOB UNDER HIS YOUNGER BROTHER NAME HOW HE DID THIS JOB SINCE 30 YEARS HOW POLICE FIND IT NOW NK GH
Fake government job: చనిపోయిన తమ్ముడి పేరుతో ప్రభుత్వ ఉద్యోగం... 30 ఏళ్ల తర్వాత...
చనిపోయిన తమ్ముడి పేరుతో ప్రభుత్వ ఉద్యోగం... 30 ఏళ్ల తర్వాత... (ప్రతీకాత్మక చిత్రం)
Fake government job: ఇదెలా సాధ్యం... చనిపోయిన వ్యక్తి వివరాలు ఉంటాయి కదా... మరి అతని పేరుతో అన్న ఎలా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు... తమ్ముడి పేరును ఎలా వాడుకున్నాడు?
మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రజలకు ఆశ ఎంతగానో ఉంటుంది. ఉన్నత విద్యను చదివిన వారు ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తారు. కొంతమంది మాత్రం అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నిస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన జమ్మూకాశ్మీర్‌లో జరిగింది. చనిపోయిన తన తమ్ముడి సర్టిఫికెట్లను ఉపయోగించి 30 ఏళ్ల కిందట ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు ఒక వ్యక్తి. ఈ విషయం తాజాగా బయట పడింది. పుల్వామాలోని అచ్చాన్ గ్రామానికి చెందిన శక్తి బంధు అలియాస్ "కాకా జీ"పై... జమ్మూకాశ్మీర్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. అతను ప్రస్తుతం జమ్మూలోని పానీ చాక్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని పోలీసులు ఆదివారం వెల్లడించారు. నిందితుడు కనీసం తొమ్మిదో తరగతి కూడా పాస్ కాకపోవడం విశేషం. ప్రస్తుతం కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది.
నిందితుడు 30 ఏళ్ల కిందట జమ్మూలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (IMPA)లో ఉద్యోగంలో చేరాడు. ఇందుకు తన తమ్ముడి పేరుతో ఉన్న స్టడీ సర్టిఫికెట్లను, ఇతర అర్హత పత్రాలను సమర్పించాడు. ఈ వివరాలు బయటపడటంతో IMPA సంస్థ ప్రతినిధులు గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై చేసిన ఎంక్వైరీ రిపోర్టును కూడా సంస్థ సమర్పించింది. అప్పటి నుంచి కేసుపై విచారణ జరుగుతోంది. తాజాగా అతడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
* చనిపోయిన వ్యక్తి పేరుతో ఉద్యోగం
శక్తి బంధు తమ్ముడు అశోక్ కుమార్ 1977లో బీఏ చదువుతుండగా చనిపోయాడు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు నిందితుడు అశోక్ పేరుతో IMPAలో ఉద్యోగం పొందాడు. ఇందుకు కొంతమంది అధికారుల సాయం తీసుకున్నాడు. నిందితుడు 30 ఏళ్లుగా అశోక్‌కుమార్ పేరుతో IMPAలో పనిచేస్తున్నాడని, అతడు కనీసం తొమ్మిదో తరగతి కూడా పాస్ కాలేదని ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. శక్తిబంధుపై IPCలోని వివిధ సెక్షన్ల కింద కేసు రాశామని పోలీసులు చెప్పారు.
* ఆధారాల సేకరణ
గతేడాది జమ్మూ క్రైం బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ చేసినట్లు పోలీసులు తెలిపారు. జమ్మూలోని IMPA, జమ్మూ కశ్మీర్ స్కూల్ ఎడ్యుకేషన్, అచ్చాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అచ్చాన్ ప్రాథమిక పాఠశాలల నుంచి అశోక్ కుమార్, శక్తి బంధు స్టడీ సర్టిఫికెట్లను పోలీసులు పరిశీలించారు. అన్ని ఆధారాలతో నిందితుడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టులో న్యాయ విచారణ తర్వాత అతనికి తీవ్రమైన శిక్షపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.