సీఎం భార్యకు షాక్.. బురిడీ కొట్టించిన సైబర్ నేరగాడు..

డబ్బు విత్‌డ్రా చేసినట్టు తన సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావడంతో ప్రణీత్ కౌర్ షాక్ తిన్నారు. దీనిపై పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. నిందితుడు జంతారా నుంచి ఫోన్ చేసినట్టు గుర్తించారు.

news18-telugu
Updated: August 8, 2019, 12:28 PM IST
సీఎం భార్యకు షాక్.. బురిడీ కొట్టించిన సైబర్ నేరగాడు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సామాన్యులనే కాదు ముఖ్యమంత్రుల సతీమణులను సైతం బురిడీ కొట్టించేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా పంజాబ్ ఎంపీ, సీఎం అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్‌ను
ఓ సైబర్ నేరగాడు బోల్తా కొట్టించాడు. ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.23లక్షలు కాజేశాడు. ప్రణీత్ కౌర్ ఇటీవల పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. స్టేట్ బ్యాంక్ మేనేజర్‌ను అంటూ ప్రణీత్‌కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. సాలరీ డిపాజిట్ కోసం బ్యాంకు ఖాతా వివరాలు చెప్పమన్నాడు. మెల్లిగా ఆ వివరాలన్నీ రాబట్టాడు. ఏటీఎం పిన్ నంబర్ సహా, ఓటీపీ నంబర్ కూడా తెలుసుకున్నాడు. అలా క్షణాల్లోనే ప్రణీత్ కౌర్ ఖాతా నుంచి రూ.23లక్షలు కాజేశాడు.మూడు దఫాలుగా ఆమె ఖాతాల నుంచి ఆ డబ్బు మొత్తం కాజేశాడు. డబ్బు విత్‌డ్రా చేసినట్టు తన సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావడంతో ప్రణీత్ కౌర్ షాక్ తిన్నారు. దీనిపై పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. నిందితుడు జంతారా నుంచి ఫోన్ చేసినట్టు గుర్తించారు.కర్మతార్ అనే గ్రామంలో స్పెషల్ పోలీస్ టీమ్ ఎట్టకేలకు అతన్ని పట్టుకుంది. అతని పేరు అతౌల్ అన్సారీ అని తెలిపింది. సైబర్ క్రైమ్ నేరాలకు జంతారా కేరాఫ్‌గా మారిందని.. గడిచిన కొన్నేళ్లలో 110 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు.

First published: August 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు