HOUSEWIFE AND TAXI DRIVER LOVE AFFAIR TAKEN THESE STEP THE INCIDENT OCCURRED IN DEVANAHALLI A SUBURB OF BANGALORE SSR
HouseWife: పెళ్లై ఆరేళ్లు అవుతున్నా భర్తతో పిల్లలు కలగలేదని ఈమె ఓ నిర్ణయం తీసుకుంది.. కానీ ఏం సుఖం..
జ్యోతి (ఫైల్ ఫొటో)
వివాహేతర సంబంధాలు ఏదో ఒకరోజు విషాదాంతానికి దారి తీస్తాయని ఎన్ని ఘటనలు రుజువు చేస్తున్నా కొందరి తీరు మారడం లేదు. క్షణిక సుఖాల మోజులో పవిత్రమైన వివాహ బంధానికి తిలోదకాలు వదులుతూ కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా.. బెంగళూరు రూరల్ జిల్లాలో కూడా అదే జరిగింది.
బెంగళూరు: వివాహేతర సంబంధాలు ఏదో ఒకరోజు విషాదాంతానికి దారి తీస్తాయని ఎన్ని ఘటనలు రుజువు చేస్తున్నా కొందరి తీరు మారడం లేదు. క్షణిక సుఖాల మోజులో పవిత్రమైన వివాహ బంధానికి తిలోదకాలు వదులుతూ కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా.. బెంగళూరు రూరల్ జిల్లాలో కూడా అదే జరిగింది. భార్యాభర్తలమని చెప్పి 20 రోజుల క్రితం దేవనహళ్లిలోని శాంతినగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్న జంట గత ఆదివారం నుంచి కనిపించకుండాపోయారు. ఇరుగుపొరుగు వారికి ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానమొచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్ధలు కొట్టి చూడగా ఇంట్లో ఆ జంట ఆత్మహత్య చేసుకుని కనిపించారు. అప్పటికే వాళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయి రోజులు గడవడంతో మృతదేహాల నుంచి దుర్వాసన వెలువడుతోంది.
దేవనహళ్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు వెలుగుచూశాయి. అసలు వాళ్లిద్దరూ భార్యాభర్తలే కాదని తెలిసింది. ఆమెకు గతంలో ఒకరితో పెళ్లైందని, భర్తను వదిలేసి ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఈ యువకుడితో వచ్చేసినట్లు విచారణలో తేలింది.
జ్యోతి, బసవరాజు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయచూర్‌కు చెందిన జ్యోతి, రాము భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. పెద్దల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లైన తర్వాత బెంగళూరులోని కొడిగెనహళ్లిలో రాము ఇల్లు అద్దెకు తీసుకుని భార్యతో కలిసి కాపురం పెట్టాడు. పెళ్లయి ఆరేళ్లు అవుతున్నప్పటికీ ఈ జంటకు పిల్లలు లేరు. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరూ కొంత అసంతృప్తితో ఉన్నారు.
ఈ క్రమంలోనే.. జ్యోతికి ట్యాక్సీ డ్రైవర్ బసవరాజుతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి పరిచయం ఎంతవరకూ వెళ్లిందంటే.. భర్తను వదిలి బసవరాజుతో వెళ్లిపోయేందుకు కూడా జ్యోతి సిద్ధపడింది. ప్రియుడు బసవరాజుతో కలిసి జ్యోతి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఇద్దరూ కలిసి భార్యాభర్తలమని చెప్పి ఇల్లు కూడా తీసుకున్నారు. 20 రోజుల వరకూ బాగానే ఉన్నారు.
కానీ.. ఇంతలో ఏం జరిగిందో తెలియదు గానీ ఇద్దరూ అద్దెకు తీసుకున్న ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని కనిపించారు. ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారా లేక మరేదైనా కారణం ఉందోనన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరూ కొత్తగా పెళ్లైందని చెప్పారని.. చాలా అన్యోన్యంగా కూడా ఉన్నారని.. వాళ్లిద్దరి తీరు చూసి నిజంగానే భార్యాభర్తలని అనుకున్నామని ఇరుగుపొరుగు వారు చెప్పారు. బసవరాజు, జ్యోతి ఆత్మహత్య స్థానికులును ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి భర్తను కూడా ఈ కేసులో విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆమె కనిపించకుండాపోయినా కనీసం మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.