Home /News /crime /

HOUSE LEASE FRAUD IN CHENNAI MORE THAN 154 PEOPLE CHEATED BY GURU REALITY PRIVATE COMPANY AND THEY RAN AWAY WITH RS 20 CRORE SRD

వామ్మో వీళ్లు మాములోళ్లు కాదు భయ్యా.. అద్దెకు ఇళ్లు తీసుకుని రూ.20కోట్లు దోచేశారు.. ఎలాగంటే..

మోసం చేసింది వీళ్లే..

మోసం చేసింది వీళ్లే..

నమ్మించి మోసం చేయడం.. అధిక డబ్బు వస్తుందని ఆశ చూపించి వలలో వేసుకోవడం నేటి రోజుల్లో ఇలాంటి ఘరానా కేటుగాళ్లు ఎక్కువైపోయారు. అలాంటి ఓ భారీ ఘరానా మోసం తమిళనాడులోని చెన్నై (Chennai)లో జరిగింది.

  నమ్మించి మోసం చేయడం.. అధిక డబ్బు వస్తుందని ఆశ చూపించి వలలో వేసుకోవడం నేటి రోజుల్లో ఇలాంటి ఘరానా కేటుగాళ్లు ఎక్కువైపోయారు. అలాంటి ఓ భారీ ఘరానా మోసం తమిళనాడులోని చెన్నై (Chennai)లో జరిగింది. వివరాల్లోకెళితే.. ఇంటిని అద్దెకు తీసుకుని.. ఆ తర్వాత లక్షలకు లీజుకిచ్చిన ఘటనలో రూ.20 కోట్లకు పైగా మోసం చేసిన ముఠాపై 154 మంది బాధితులు.. డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.చెన్నై పక్కనే ఉన్న కోవిలంబాక్కంలోని సిండికేట్ బ్యాంక్ కాలనీ రోడ్, భూపతినగర్, పల్లవరం-దురైపాక్కం రేడియల్ రోడ్‌లో చోళై ముత్తురాజా గురు రియల్టీ అసోసియేట్స్‌ను నడుపుతున్నాడు. కంపెనీ కొత్తగా నిర్మించే ఇళ్లను లక్ష్యంగా చేసుకునేది. ఇంటి అద్దెను నెలవారీగా చెల్లిస్తామని ఇంటి యజమానులతో ఒప్పందం చేసుకుంది.

  ఆ తర్వాత ఆ ఇళ్లనే లీజుకు ఇస్తామని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ OLX ద్వారా ప్రచారం చేశారు. ఈ ప్రకటన చూసి వందలాది మంది రూ.4 లక్షల నుంచి 30 లక్షల వరకు చెల్లించి ఇళ్లను లీజుకు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయం ఆ ఇంటి యజమానులకు తెలియకుండా వీరితో అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే.. తమ ఇళ్లకు గత కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు వెంటనే ఖాళీ చేయాలని ఇంటిలో ఉన్న వారిని కోరారు.  అయితే.. మేం లక్షల్లో చెల్లించి.. ఇంటిని లీజుకు తీసుకున్నామని.. ఖాళీ ఎందుకు చేయాలని ప్రశ్నించారు. ఆ వెంటనే ఇంటి యజమానులు ఒక్కసారిగా షాకయ్యారు. అసలు విషయం లీజుకు తీసుకున్నవారికి చెప్పారు. తాము..చోళై ముత్తురాజా గురు రియల్టీ అసోసియేట్స్‌కు అద్దెకు ఇచ్చామని తెలిపారు. దీంతో.. తాము మోసపోయామని ఇరు వర్గాలు గుర్తించాయి.

  మోసం చేసిన గురు రియల్టీ సంస్థ


  కొంత మొత్తం చెల్లించి ఇంటిని అద్దెకు ఇస్తున్నట్లుగా యజమానితో అగ్రిమెంట్ చేసుకున్న సోలాయి ముత్తురాజా.. మరో పక్క ఇల్లు ఖాళీగా ఉందని ప్రచారం చేస్తూ ఇంటికొచ్చిన వారిని టార్గెట్ చేసి.. ఆ తర్వాత లీజుకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు లక్షల్లో డబ్బులు తీసుకుని ఆ ఇళ్లను లీజుకు అప్పగించేవారు. ఇలా.. మోసపోయిన వారి సంఖ్య 150కు పైనే ఉంది.

  మోసపోయిన 154 మంది తమ డబ్బును తిరిగి ఇప్పించాలని చెన్నైలోని పనయూర్ ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని పల్లికారాణి డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 154 మందిని కుట్ర పన్ని మోసం చేసిన గురు రియల్టీ అసోసియేట్స్ యజమాని చోళై ముత్తురాజా, అతని సహాయకుడు అమలి, రమేష్, సంతోష్, కృష్ణ, శివ, మంజు, శరవణన్, రేణుక, మహాలక్ష్మి పరారీలో ఉన్నారు. చోళై ముత్తురాజా 20 కోట్లకు పైగా మోసపోయాడని.. అతనిలో చేతిలో ఇంకా చాలా మంది మోసపోయారని..మోసపోయిన డబ్బు విలువ మరింత పెరిగే అవకాశం ఉందని బాధితులు తెలిపారు.

  మీడియాకు తమ బాధను చెప్పుకుంటున్న బాధితులు


  చొషింగనల్లూర్, పెరుంబాక్కం, దురైపాక్కం, తిరువాన్మియూర్, సెమ్మంచెరి, వెలచ్చేరి, పల్లవరం, పల్లికారణి, కేతువంకేణి, అడయార్ సహా పలు ప్రాంతాల్లో 150కి పైగా ఇళ్లను గురు రియల్టీ అసోసియేట్స్ ఆధీనంలో ఉంచుకుని 20 కోట్లకు పైగా డబ్బులు తీసుకుని.. ఆ సొమ్ముతో పరారీలో ఉన్నట్లు వెల్లడైంది.

  ప్రస్తుతం ముత్తురాజా సెల్‌ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ లో ఉంది. చోషింగనల్లూర్ ప్రాంతంలో రూ.7.5 లక్షలకు ఇంటిని లీజుకు తీసుకుంది అరుల్ అనే మహిళ. అలాగే.. తిరువాన్మియూర్‌లో రెండు పడక గదుల ఇంటిని లీజుకు ఇచ్చేందుకు ఖాదర్ గురు రియాల్టీ అసోసియేట్స్‌కు రూ.18 లక్షలు చెల్లించగా.. వారు తాళం వేసి పది రోజుల్లో ఇంటిని రెడీ చేసి ఇస్తామని చెప్పారు.

  ఆ తర్వాత గురు రియాల్టీ కంపెనీని అడిగితే ఇల్లు అమ్మేశారని, మరో ఇస్తానని మరో పదిరోజులు కావాలని అడిగారు.. ఆ తర్వాత ఖాదర్ రియల్టీ కంపెనీకి వెళ్లినప్పుడు తాళం వేసి ఉండటంతో మోసపోయినట్లు గ్రహించాడు. తనలా చాలా మంది మోసపోయి కంపెనీ వెతుక్కుంటూ వచ్చినప్పుడే అసలు విషయం తెలిసిందని ఖాదర్ తెలిపారు.వివిధ రకాల మనీ మోసాలు జరుగుతున్న ఈ టైంలో గురు రియాల్టీ అసోసియేట్స్ ఇళ్లు, యజమానులను లక్ష్యంగా చేసుకుని ఇలా చీట్ చేయడం పెద్ద షాక్ కు గురిచేసింది.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Chennai, Crime, Crime news, Tamil nadu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు