సలసలా కాగే నూనెను ముఖంపై పోసి దాడి.. ప్రకాశంలో దారుణం

కస్టమర్ల ముందే తిట్టడంతో సిబ్బంది తీవ్ర అవమానంగా భావించారు. యజమానిపై పట్టరాని కోపంతో ఊగిపోయి నూనెతో దాడి చేశారు. సలసలాకాగుతున్న నూనెను అతడిపై పోశారు.

news18-telugu
Updated: September 17, 2019, 3:06 PM IST
సలసలా కాగే నూనెను ముఖంపై పోసి దాడి.. ప్రకాశంలో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. హోటల్ యజమానిపై సిబ్బంది నూన్‌తో దాడి చేశారు. సలాసలాకాగుతున్న నూనెను అతడి ముఖంపై పోసి దాడిచేశారు. మార్టూరులో ఈ ఘటన జరిగింది. వేడి నూనె పోయడంతో హోటల్ ఓనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. పేర్ని వెంకటరావు అనే వ్యక్తి మార్టూరులోని నాగరాజుపల్లి చౌరస్తాలో హోటల్ నడుపుతున్నారు. నరేంద్ర, గోపి అనే ఇద్దరు అన్నా దమ్ముళ్లు హోటల్‌లో పనిచేస్తున్నారు. ఐతే సోమవారం వీరు హోటల్‌కు ఆలస్యంగా రావడంతో యజమాని వెంకటరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కస్టమర్ల ముందే తిట్టడంతో సిబ్బంది తీవ్ర అవమానంగా భావించారు. యజమానిపై పట్టరాని కోపంతో ఊగిపోయి నూనెతో దాడి చేశారు. సలసలాకాగుతున్న నూనెను అతడిపై పోశారు. దాంతో వెంకటరావు ముఖం, తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. మొదట మార్టూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading