Home /News /crime /

HOTEL OWNER ARRESTED FOR SPITTING BREAD BAKER IN LUCKNOW UTTAR PRADESH SNR

తందూరి రొట్టెలు చేసిన వాడి చేతికి సంకెళ్లు..యాక్‌ థూ వాడంత పని చేశాడా

Photo Credit: Youtube

Photo Credit: Youtube

Uttar Pradesh: ఎవరెన్ని కేసులు పెట్టుకున్నా వాళ్లు మారడం లేదు. హోటల్‌లు, దాబాలు, ఫంక్షన్‌లు ఒక్కచోట కాదు..ఎక్కడైనా రొట్టెలు చేయాలంటే కచ్చితంగా పిండిపై ఉమ్మి వేస్తూ కాలుస్తున్నారు. లక్నోలోని ఓ దాబాలో ఓ వంట మాస్టర్ చేసిన రోటీ మేకింగ్ వీడియో తెగ వైరల్ కావడంతో ఓనర్‌పై కేసు నమోదైంది.

ఇంకా చదవండి ...
ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే మంచి భోజనం తింటే ఆరోగ్యంగా ఉంటామని అర్ధం. కానీ తినే పదార్ధాలను తయారు చేసేటప్పుడు కాళ్లతో తొక్కుతూ..చేతులకు ఉమ్ము రాసుకొని చేస్తే ..ఎంత వారైనా అనారోగ్యం పాలవ్వాల్సిందే. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)రాజధాని లక్నో(Lucknow)లోని ఓ దాబాలో వంటవాడు అదే చేశాడు. రొట్టెలు కాలుస్తూ దానిపై నీళ్లు, నూనెకు బదులుగా తన ఉమ్మి వేస్తూ కాల్చుతున్నాడు. పబ్లిక్‌గా జరుగుతుంటే ..ఎవరి కంటపడకుండా ఉంటుంది చెప్పండి. అందుకే ఉమ్ముతో కాల్చుతున్న రొట్టెల వీడియో (Video) సోషల్ మీడియా(Social media)లో వైరల్ (Viral)కావడంతో అధికారులు యాక్షన్ మొదలు పెట్టారు. అసలు ఇది జరిగింది ఎక్కడో చెప్పలేదు కదూ..కకోరి(Kakori)లోని ఇమామ్‌ అలీ (Imam ali)దాబాలో తందూరీ(Tandoori)లో రోట్టెలు కాల్చుతున్న వ్యక్తి చేతిలో ఉన్న పిండిని రొట్టెగా వెడల్పు చేసి దానిపై ఉమ్మివేస్తూ కాల్చాడు. కస్టమర్లు చూస్తారన్న భయం, ఇలా తయారు చేస్తే హోటల్‌(Hotel)కి వచ్చి తినే వాళ్ల ఆరోగ్యం ఏమైపోతుందన్న మానవత్వం కూడా లేకుండా ఇలాగే రొట్టెలు కాల్చుతున్నాడు. అతనికి పక్కనే మరో సిబ్బంది ఉండి కాల్చిన రొట్టెలను కస్టమర్లకు వడ్డించేందుకు తీసుకెళ్తున్నాడు. ఇలాగే చేస్తుండగా ఓ కస్టమర్ వీళ్లు తయారు చేస్తున్న రొట్టెలు ఏమాత్రం శుభ్రంగా ఉన్నాచో చూడండి అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఇమామ్‌ అలీ హోటల్‌ బాగా అన్‌పాపులర్ అయింది.

ఆ దాబాలో ఏంటా దరిద్రం..
దాబాలో ఈరకంగా రొట్టెలు కాల్చుతున్నారని తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగారు. వాళ్లు పనిచేస్తున్న విధానాన్ని పరిశీలించి దాబా యజమాని యాకూబ్‌తో పాటు మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. కరోనా ఓవైపు దడ పుట్టిస్తుంటే రోడ్డు మీదే ఉమ్మి వేయకూడదని ఆంక్షలు అమలు చేస్తున్న ఇలాంటి సమయంలో ఏకంగా రొట్టెలపైనే ఉమ్మి వేయడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. హోటల్‌పై కేసు నమోదు చేశారు.

రొట్టెలు కాల్చే ముందు వాటిపై ఉమ్మి వేయాలా..
ఉత్తరప్రదేశ్‌లో ఇదేం కొత్తకాదు. గతంలో కూడా మీరట్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో కూడా రోటీలు చేసే నౌషద్ అనే వ్యక్తి కూడా గెస్ట్‌లకు అందించే రొట్టెలపై తన ఉమ్మివేస్తూ కాల్చి వార్తలకెక్కాడు. అప్పుడు ఆ ఘటనలో అతడిపై జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. అంటువ్యాధుల నిరోధక చట్టం. ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అటు ఘజియాబాద్‌లో కూడా ఓ కుక్‌ రొట్టెలు చేస్తూ ఉమ్మివేయడం ప్రకంపనలు సృష్టించింది. ఆ సందర్భంలో కూడా అతనిపై కేసు పెట్టారు. ఇదిగో ఇలాంటి సంఘటన చూసే పెద్దలు ఇంటి భోజనమే శ్రేష్టం అని చెబుతుంటారు. సో బీ కేర్‌ ఫుల్‌.
Published by:Siva Nanduri
First published:

Tags: Food videos, VIRAL NEWS, Viral vide

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు