బిల్లు కట్టలేదని కస్టమర్‌ను కొట్టి చంపిన ఓనర్.. బిల్లు ఎంతంటే..

బిల్లు కట్టకుండా వెళ్లిపోవాలని చూశారంటూ సూరజ్ సింగ్, విశాల్ దూబే మీద హోటల్ యజమాని, మరో వెయిటర్ కలసి కర్రలతో దాడి చేశారు.

news18-telugu
Updated: September 5, 2019, 6:53 PM IST
బిల్లు కట్టలేదని కస్టమర్‌ను కొట్టి చంపిన ఓనర్.. బిల్లు ఎంతంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హోటల్లో బిల్లు కట్టలేదన్న కారణంతో ఓ హోటల్ ఓనర్, అందులో పనిచేసే వెయిటర్ కలసి ఓ కస్టమర్‌ను కొట్టి చంపారు. ఉత్తరప్రదేశ్‌లోని బదోని జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇంతకీ అతడు కట్టాల్సిన బిల్లు ఎంతో తెలుసా? రూ.180. మహారాజ్‌గంజ్ ప్రాంతంలోని ఓ దాబాలో సూరజ్ సిగ్, విశాల్ దూబేలు ఫుడ్ తిన్నారు. ఆ బిల్లు రూ.180 అయింది. కానీ, వారు ఆ బిల్లు కట్టలేదు. దీంతో హోటల్ యజమాని గుర్మెయిల్ సింగ్ వారిని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. బిల్లు కట్టకుండా వెళ్లిపోవాలని చూశారంటూ సూరజ్ సింగ్, విశాల్ దూబే మీద హోటల్ యజమాని, మరో వెయిటర్ కలసి కర్రలతో దాడి చేశారు. వారి దాడి నుంచి దూబే తప్పించుకుని పారిపోయాడు. సూరజ్ సింగ్ మాత్రం దొరికిపోయి చావుదెబ్బలు తిన్నాడు. వారి దెబ్బలకు తాళలేక చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి హోటల్ ఓనర్ గుర్మెయిల్ సింగ్, అతడి కుమారుడు సురేందర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు