హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఎమ్మెల్యే బంధువు దాష్టీకం.. ముగ్గురు బిచ్చగాళ్లను కొట్టి.. వేడి నీళ్లు పోసి చంపేశాడు

ఎమ్మెల్యే బంధువు దాష్టీకం.. ముగ్గురు బిచ్చగాళ్లను కొట్టి.. వేడి నీళ్లు పోసి చంపేశాడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హోటల్ ముందు కూర్చుంటున్నారన్న కారణంతో.. ముగ్గురు బిచ్చగాళ్లను కొట్టి.. వారిపై వేడి నీళ్లు పోసి చంపేశాడు హోటల్ నిర్వాహకుడు. మహారాష్ట్రలోని పుణెలో ఈ ఘోరం జరిగింది.

వారు బిచ్చగాళ్లు. రోడ్డుపై యాచిస్తూ జీవనం సాగిస్తారు. ఎవరైనా దయదలిచి డబ్బులిస్తే.. వాటితోనే బతుకుతారు. లేదంటే పస్తులుంటారు. వారిని చూస్తే.. ఎవరికైనా అయ్యో..పాపం అనిపిస్తుంది. ఏదైనా సాయం చేయాలనిపిస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం.. వారిని కిరాతకంగా చంపేశాడు. కర్రలతో కొట్టి.. సలసలా కాగే నీళ్లు పోసి.. హత్య చేశాడు. హోటల్ ముందు కూర్చున్నందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఈ ఘోరం జరిగింది. మే 23 ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు స్థానిక ఎమ్మెల్యేకు బంధువు కావడంతో.. పోలీసులు కావాలనే కేసు నీరుగారుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Hyderabad Gang Rape: హైదరాబాద్ గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి.. బండి సంజయ్

సస్వాద్‌కు చెందిన నీలేశ్​ జయంత్ జగ్తాప్ అనే వ్యక్తి అహల్యదేవి మార్కెట్‌లో ఓ హోటల్‌ను నిర్వహిస్తున్నాాడు. ఐతే కొందరు బిచ్చగాళ్లు ప్రతిరోజూ అక్కడికి వచ్చి.. హోటల్ ముందు కూర్చుంటారు. హోటల్‌కు వచ్చే వారు దయదలిచి డబ్బులిస్తే.. వాటిని తీసుకుంటారు. ఐతే అక్కడ కూర్చోవద్దని నీలేశ్ పలుమార్లు వారిని హెచ్చరించారు. ఐనా వినకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే మే 23న ముగ్గురు బిచ్చగాళ్లపై దాడి చేశాడు. వారిని కర్రలతో చితకబాదాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే వారిపై విరుచుకుపడ్డాడు. అంతటితో ఆగలేదు. మరుగుతున్న వేడి నీటిని వారిపై పోశారు. తీవ్ర గాయాల పాలైన బిచ్చగాళ్లు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Telangana: బాలికపై అత్యాచారం కేసులో హోంమంత్రి మనవడు.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

ఈ ఘటన సస్వాడ్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే జరిగింది. అయినా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. చివరకు ఘటన జరిగిన వారం రోజుల తర్వాత కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటికీ నిందితుడిని పట్టుకోలేదు. దీని వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీలేశ్ జయంత్ స్థానిక ఎమ్మెల్యేకు బంధువు అవుతారని.. ఎమ్మెల్యే ఒత్తిడితోనే పోలీసులు కేసు లైట్ తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల తీరుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. నడిరోడ్డుపై ముగ్గురు బిచ్చగాళ్లను చంపేసినా.. పట్టించుకోరా? అని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

First published:

Tags: Crime, Crime news, Maharastra, Pune