HOME »NEWS »CRIME »hosur muthoot finance robbery case hyderabad police arrest four accused su

Muthoot Finance Robbery: తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ చోరీ.. కేసును చేధించిన హైదరాబాద్ పోలీసులు

Muthoot Finance Robbery: తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ చోరీ.. కేసును చేధించిన హైదరాబాద్ పోలీసులు
ప్రతీకాత్మక చిత్రం

తమిళనాడులోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లో దోపిడికి పాల్పడిన ముఠాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Share this:
    తమిళనాడులోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లో దోపిడికి పాల్పడిన ముఠాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని హోసురులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో శుక్రవారం(జనవరి 22) దుండగులు బంగారం, డబ్బులు దోచుకెళ్లారు. హోసూరు-బాగలూరు రోడ్డులో ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్ బ్రాంచ్‌లోకి మాస్క్‌లు, హెల్మెట్లు ధరించి లోనికి చొరబడ్డ దుండగులు.. ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారు. గన్స్‌తో వారిని బెదిరించారు. అనంతరం రూ. 7.40 కోట్ల విలువైన బంగారం, 96వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. అక్కడ ఉన్న వినియోగదారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే హోసూరు డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. దుండగులు హిందీలో మాట్లాడారని, ఉత్తరాది వారిగా అనుమానిస్తున్నట్లు సంస్థ మేనేజర్‌ తెలిపారు.

    అయితే ఈ చోరికి పాల్పడ్డ దుండగులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ముఠాకు చెందిన మొత్తం నలుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి మరో 15 మంది సహకరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దోపిడికి పాల్పడ్డ అనంతరం దొంగలు హైదరాబాద్‌కు చేరుకుని.. ఇక్కడి నుంచి కర్ణాటకకు పారిపోవాలని చూశారు. అయితే ముత్తూట్ దోపిడి గురించి సమాచారం రావడంతో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గట్టి నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే దోపిడి దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.



    దోపిడి దొంగల నుంచి చోరి చేసిన దాదాపు మొత్తం ఆభరణాలను, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మరికాసేపట్లో పోలీసులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
    Published by:Sumanth Kanukula
    First published:January 23, 2021, 11:58 IST

    टॉप स्टोरीज