అమ్మాయిలను కంటికి రెప్పలా కాపాడాల్సిన హాస్టల్ వార్డెన్ బరి తెగించాడు. కంచే చేను మేసిందన్న చందంగా దారుణంగా ప్రవర్తించాడు. హాస్టల్ బాత్రూమ్స్‌లో యువతులు స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. వాటితో బ్లాక్ మెయిల్ చేస్తూ యువతులను నిత్యం వేధిస్తున్నాడు. ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో ఈ ఘటన జరిగింది. అమ్మాయిల నగ్న వీడియోలు తీసిన హాస్టల్ వార్డెన్ ... వాటిని చూపించి తన కోరిక తీర్చాలని నిత్యం వేధించేవాడు. అంతేకాదు డబ్బులు కూడా డిమాండ్ చేసేవాడు. లేదంటే ఆ వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. అతడి టార్చర్ తట్టుకోలేక ఇటీవల ఓ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. హాస్టల్‌లోని తోటి విద్యార్థులు ఆమెను కాపాడి.. అనంతరం కీచక వార్డెన్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతడి బాగోతం బట్టబయలయింది. యువతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు వార్డెన్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Gurugram, Haryana