హోమ్ /వార్తలు /క్రైమ్ /

Private Hospital: పేషెంట్ కూతురు స్నానం చేస్తుండగా పక్క బాత్రూమ్‌ నుంచి వీడియో తీసి..

Private Hospital: పేషెంట్ కూతురు స్నానం చేస్తుండగా పక్క బాత్రూమ్‌ నుంచి వీడియో తీసి..

కరీంనగర్ లోని ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలో నీచ కలాపం బయటపడింది. పేషెంట్ కూతురు స్నానం చేస్తుండగా పక్క బాత్రూమ్ నుంచి వీడియో తీశాడు ఆస్పత్రి సిబ్బంది. యాజమాన్యం తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. పోలీసులూ అటు ఇటుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.

కరీంనగర్ లోని ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలో నీచ కలాపం బయటపడింది. పేషెంట్ కూతురు స్నానం చేస్తుండగా పక్క బాత్రూమ్ నుంచి వీడియో తీశాడు ఆస్పత్రి సిబ్బంది. యాజమాన్యం తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. పోలీసులూ అటు ఇటుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.

కరీంనగర్ లోని ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలో నీచ కలాపం బయటపడింది. పేషెంట్ కూతురు స్నానం చేస్తుండగా పక్క బాత్రూమ్ నుంచి వీడియో తీశాడు ఆస్పత్రి సిబ్బంది. యాజమాన్యం తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. పోలీసులూ అటు ఇటుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.

ఇంకా చదవండి ...

  (P.Srinivas,News18,Karimnagar)

  ఆడవాళ్లపై లైంగిక అకృత్యాలకు సంబంధించి మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నాపెద్దా తేడాలెరుగని కీచకులు.. అవతలివాళ్లు బాధల్లో ఉన్నా తమ పైశాచికత్వాన్ని కొనసాగిస్తూనే ఉంటారనడానికి మరో ఉదాహరణ ఇది. అనారోగ్యంతో చికిత్స పొందుతోన్న తండ్రికి సేవలు చేసేందుకు ఆస్పత్రిలో ఉన్న అమ్మాయి పట్ల.. అక్కడి సిబ్బందిలో ఒకడు దారుణంగా వ్యవహరించాడు. పేషెంట్ కూతురు స్నానం చేస్తుండగా పక్క బాత్రూమ్ నుంచి వీడియో తీశాడు. అయితే ఆస్పత్రి యాజమాన్యం మాత్రం తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. పోలీసులూ అటు ఇటుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది..

  పెద్దపెల్లి జిల్లా కొలనూరుకు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధ పడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. కొద్ది రోజులుగా అతనికి సహాయంగా కూతురు కూడా ఆస్పత్రిలోనే ఉంటోంది. సోమవారం నాటికి ఆరోగ్యం కాస్త మెరుగుపడటంతో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పారు. బ్యాగేజీ మొత్తం సర్దుకున్న ఆ అమ్మాయి ఆస్పత్రిలో ఉన్న బాత్రూంలో స్నానం చేసేందుకు వెళ్లింది.

  CM KCR వ్యూహం బెడిసికొట్టిందా? -కేజ్రీవాల్‌తో భేటీ లేనట్టే? -ఢిల్లీ పర్యటన దానికోసం కాదట!


  పేషెంట్ కూతురు స్నానం చేస్తుండగా పక్క బాత్రూం లో ఉండి ఎవరో సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరిస్తుండటం గమనించి కేకలు వేసింది. వెంటనే అక్కడే ఉన్న యువతి తల్లి, సోదరి విషయం తెలుసుకొని పరిశీలన కోసం పక్కనున్న బాత్రూంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా, మరో ఉద్యోగి వాళ్లను అడ్డుకున్నాడు. తోసుకొని వెళ్లి చూడగా, ఆస్పత్రి యూనిఫామ్ లో ఒకడు బాత్రూమ్ లో నక్కి కనిపించాడు. వీడియో చిత్రీకరణలో ఇద్దరు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు అనుమానించిన బాధితులు విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. కానీ,

  Collage Girl: టూత్‌పేస్ట్ అనుకొని ఎలుకల మందుతో పళ్లు తోమి.. షాకింగ్ ఘటన


  స్నానం చేస్తుండగా ఆస్పత్రి సిబ్బంది వీడియో తీశారన్న బాధితుల ఫిర్యాదుపై యాజమాన్యం భిన్నంగా స్పందించింది. తమ సిబ్బందిని వెనుకేసుకొచ్చిన యాజమాన్యం.. బాధితులదే తప్పు అని బుకాయించే ప్రయత్నం చేసింది. వీడియోల విషయం బయటికి పొక్కితే ఆస్పత్రి పరువు పోతుందనే ఉద్దేశంతో యాజమాన్యం తమ పలుకుబడిని ఉపయోగించి.. పోలీసులను పిలిపించి పేషెంట్ కుటుంబసభ్యులనే పోలీస్ స్టేషన్ లో పడేలా చేశారు. వీడియో తీసిన కీచకులను పక్కకు తప్పించి, బాధితులను బెదిరించి వదిలేశారు. ఆ తర్వాత..

  Telangana Traffic e-challan:75% Discountతో కాసుల వర్షం.. తొలిరోజే రూ.6 కోట్ల వసూళ్లు


  ఆస్పత్రి యాజమాన్యం, పోలీసుల తీరుతో ఇంకాస్త షాక్ తిన్న పేషెంట్ తరఫు బంధువు.. ఆస్పత్రిలో దారుణాలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. మీడియా సహాయంతో ఆస్పత్రిలో జరుగుతోన్న గలీజు పనులను బయటపెట్టారు. రెండు బాత్రూమ్ లకు మధ్య పెద్ద రంధ్రం ఉండటం మీడియా కెమెరాలకూ చిక్కింది. ఆస్పత్రిలోకి మీడియా వాళ్లొచ్చారనే సమాచారంతో హుటాహుటిన మళ్లీ వచ్చి అప్పుడుగానీ తప్పుడు వీడియోలు తీసిన ఆస్పత్రి సిబ్బందిని తూతూమంత్రంగా విచారించారు.


  Rambha: నటి రంభ.. వెండితెరకు దూరమై 14 ఏళ్లు.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇలా..


  రెనీ ఆస్పత్రిపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. తాజా ఘటనలో బాధితురాళ్లను బెదిరింపులకు గురిచేసిన వైనంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఆస్పత్రి బాత్రూమ్ లో సరైన భద్రత లేకపోవడాన్ని బయటపెట్టే వీడియోలు స్థానికంగా వైరల్ కావడంతో చివరికి పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు. వీడియో తీసిన నిందితుడిని మానకొండూరు మండలానికి చెందిన రామగిరి అరవింద్ గా గుర్తించిన పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీడియో తీసిన వ్యక్తితోపాటు ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

  First published:

  Tags: Crime news, Hospitals, Karimnagar

  ఉత్తమ కథలు