HOSPITAL STAFF SAW A NEWBORN BABY GIRL LYING DEAD WITH AN UMBILICAL CORD IN A TOILET WATER TANK SSR
Shameful Incident: పెళ్లైన వ్యక్తితో అఫైర్.. అంతటితో ఆగక ఎంత పాపం చేసిందంటే.. ఆ దేవుడు కూడా క్షమించడు..
నిందితురాలు
తమిళనాడులో అమానుష ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి ముందే తల్లయిన ఓ యువతి ప్రసవించిన వెంటనే ఆ పసికందును చంపి టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్‌లో పడేసిన ఘటన తంజావూరులో కలకలం రేపింది.
తంజావూరు: తమిళనాడులో అమానుష ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి ముందే తల్లయిన ఓ యువతి ప్రసవించిన వెంటనే ఆ పసికందును చంపి టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్‌లో పడేసిన ఘటన తంజావూరులో కలకలం రేపింది. తంజావూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లా పుతలూరుకు సమీపంలోని అలక్కుడికి చెందిన ప్రియదర్శిని అనే 24 ఏళ్ల యువతి పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం నడిపి పెళ్లికి ముందే తల్లైంది. ఇటీవల ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ గురించి అందరికీ తెలిస్తే తన పరువు పోతుందని భావించిన ప్రియదర్శిని గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో వాళ్లకు కడుపు నొప్పిగా ఉందని.. ఆసుపత్రికి వెళ్లొస్తానని చెప్పి తంజావూరుకు చేరుకుంది. తంజావూరు ప్రభుత్వాసుపత్రిలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
కానీ.. బిడ్డ పుట్టిన గంటల వ్యవధిలోనే ఎవరూ చూడకుండా ఆ బిడ్డను తీసుకుని అదే ఆసుపత్రిలోని ఓ బాత్రూమ్లోకి వెళ్లింది. ఆ బిడ్డను ఫ్లష్ ట్యాంక్‌లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు బాత్రూమ్ క్లీన్ చేసేందుకు వెళ్లిన హౌస్ కీపింగ్ సిబ్బంది ఫ్లష్ ట్యాంక్‌లో పసికందు పడి ఉండటాన్ని చూసి కంగుతిన్నారు. వైద్యులకు విషయం చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హాస్పిటల్ సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి ప్రియదర్శిని టాయ్‌లెట్ దగ్గర్లో తిరుగుతుండటాన్ని గమనించారు. బిడ్డతో సహా బాత్రూమ్లోకి వెళ్లి కొంతసేపటి తర్వాత ఆమె బయటకు రావడం ఆ సీసీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది. డిసెంబర్ 3న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలు ప్రియదర్శినిగా పోలీసులు తేల్చారు.
ఆమె కోసం తంజావూరు, కళ్యాణపురం, తిరుపూంతిరుత్తితో సహా సమీప ప్రాంతాల్లో గాలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రియదర్శిని అలక్కుడి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఎట్టకేలకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 4న ఉదయం టాయిలెట్ క్లీన్ చేసేందుకు వెళ్లగా ఫ్లష్ ట్యాంక్‌లో ముక్కు పచ్చలారని పసికందు కనిపించే సరికి ఒక్కసారిగా భయంతో కేకలేశానని.. ఆ చిన్న పాపను అలా చూసి పాపం అనిపించిందని.. ఎంతో ఏడ్చానని ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కన్న తల్లికి ఇలాంటి పనిచేయడానికి చేతులెలా వచ్చాయని ఈ విషయం తెలిసిన వాళ్లు అనుకున్నారు. క్షణిక సుఖాల మోజులో పడి అభంశుభం తెలియని బిడ్డను కని పారేసిన ఇలాంటి వారికి కఠినంగా శిక్ష పడాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పెళ్లికి ముందే సెక్స్ వ్యామోహంలో కన్నూమిన్నూ కానరాకుండా కామంతో ఈమె చేసిన పనివల్ల ఓ నిండు ప్రాణం బలి కావడం శోచనీయం.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.