హోమ్ /వార్తలు /క్రైమ్ /

Bhadrachalam:దవఖానాలో దరిద్రుడు..గర్భిణికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి..

Bhadrachalam:దవఖానాలో దరిద్రుడు..గర్భిణికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి..

(కామపిశాచి)

(కామపిశాచి)

OMG:వాడికి కామంతో కళ్లు మూసుకుపోయాయి. బిడ్డను కనేందుకు ఆసుపత్రికి వచ్చిన గర్భిణిపైనే సిబ్బంది అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తోటి ఉద్యోగి అడ్డుపడుతున్నా పట్టించుకోకుండా దురాగతానికి ఒడిగట్టాలని చూశాడు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన దురాగతం స్థానికంగా కలకలం రేపుతోంది.

ఇంకా చదవండి ...

(G.srinivasReddy,News18,Khammam)

ఆడవాళ్ల, మాన, ప్రాణాలకు ఎక్కడా రక్షణ లేదనే నగ్నసత్యం మరోసారి రుజువైంది. బిడ్డను కనడానికి నిండు గర్భంతో ఆసుపత్రికి వెళ్తే అక్కడ కూడా ఓ కామాంధుడు కాచుకొని కూర్చున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kottagudem)జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చెప్పడానికే అత్యంత జుగుప్సాకరంగా ఉంది. దారుణం జరగడానికి ముందు బాధితురాలు నెలలు నిండి..కడుపులో బిడ్డను మోస్తూ ఆసుపత్రికి వచ్చింది. బాధితురాలిది భద్రాచలం (Bhadrachalam)పక్కనే ఉన్న చిన్న గ్రామం కావడంతో అక్కడ వైద్య, సౌకర్యాలు, ప్రసూతి కేంద్రం లేకపోవడంతో భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)లో చేర్చారు కుటుంబ సభ్యులు. నొప్పులు రావడంతో డెలివరీ(Delivery)నిమిత్తం వెంటనే ఆపరేషన్‌ థియేటర్‌(Operation Theater)కి తీసుకెళ్లాడు ఎంఎస్‌వో లాల్‌ఖాన్(MSO Lal Khan). అక్కడే తాను మనిషిని..ఓ తల్లికే జన్మించాననే విషయాన్ని మర్చిపోయాడు. కృరమృగంలా మారి బాధితురాలికి మత్తు ఇంజెక్షన్(Anesthetic injection) ఇచ్చి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఓ కామాంధుడు ఆసుపత్రి సిబ్బంది రూపంలో గర్భిణిPregnantపై అఘాయిత్యానికి పాల్పడటం చూసిన తోటి ఉద్యోగి వద్దని గట్టిగా చెప్పినప్పటికి వినిపించుకోకుండా తన కామవాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించాడు ఎంఎస్‌వో లాల్‌ఖాన్.

దవఖానాలో దరిద్రుడు..

బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన గర్భిణిపై ఆసుపత్రిలో పని చేస్తున్న సిబ్బంది అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గర్భిణిపై అత్యాచార ప్రయత్నం చేయడాన్ని అడ్డుకున్న మరో సిబ్బంది విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సూపరింటెండెంట్ సీరియస్‌గా స్పందించారు. దారుణానికి ఒడిగట్టిన ఎంఎస్‌వో లాల్‌ఖాన్‌ మెమో జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంతటి కిరాతకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారా లేక మెమో జారీ చేసి వదిలేశారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

కాటేయబోయిన కామాంధుడు..

మరోపైవు గర్భణిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆసుపత్రితో పాటు టౌన్‌లో తీవ్ర అలజడి రేపింది. బాధితురాలి కుటుంబ సభ్యులు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆసుపత్రిలో పశువు కంటే హీనంగా ప్రవర్తించిన కామాంధుడ్ని మెమో జారీ చేయడం కాకుండా..కఠినంగా శిక్షించాలని ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘాతుకం మరెవరూ పాల్పడకుండా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

First published:

Tags: Badradri, Pregnant women, Rape attempt

ఉత్తమ కథలు