హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: అమానవీయం.. దివ్యాంగుడిని రాడ్ తో కొడుతూ.. పాదాలను నాకించుకుంటూ.. వీడియో వైరల్..

OMG: అమానవీయం.. దివ్యాంగుడిని రాడ్ తో కొడుతూ.. పాదాలను నాకించుకుంటూ.. వీడియో వైరల్..

దివ్యాంగుడిపై అమానుషం

దివ్యాంగుడిపై అమానుషం

Odisha: దివ్యాంగుడి పట్ల కొందరు దారుణంగా ప్రవర్తించారు. రాడ్ తో కొడుతూ.. నోటికొచ్చినట్లు బూతులు తిట్టారు. అంతటితో ఆగకుండా.. పాదాలను కూడా నాకించుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Odisha (Orissa), India

కొన్ని చోట్ల సమాజాంలో సభ్య సమాజం తలదించుకునే విధంగా దారుణాలు వెలుగులోనికి వస్తున్నాయి. కొందరు ఉన్మాదులు సమాజంలో విచ్చల విడిగా ప్రవర్తిస్తుంటారు. మహిళలను, పెద్దవాళ్లు, దివ్యాంగులపైకి దాడులకు తెగపడుతుంటారు. మరికొందరు ఇష్టమోచ్చినట్లు దాదాగిరి చేస్తుంటారు. మద్యం మత్తులో, గంజాయి మత్తులో అనేక దారుణాలకు పాల్పడుతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఒడిశాలోని (Odisha)  మయూర్ భంజ్ లో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న హోటల్ లో ఇద్దరు వ్యక్తులు దివ్యాంగుడిపై అమానవీయంగా ప్రవర్తించారు. అతడని రాడ్ తో కొడుతూ.. నోటికొచ్చినట్టు బూతులు తిడుతున్నారు. అంతటితో ఆగకుండా.. ఒక వ్యక్తి పాదాలను నాకుతూ దారుణంగా ప్రవర్తించారు. మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా (Viral video) మారింది. అయితే.. ఈ ఘటన గతేడాది జరిగిందని ఎస్పీ అన్నారు. కాగా, మరోసారి ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. దీనిపై అధికారులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా  సోషల్ మీడియా(Social Media)లో ప్రతిరోజూ వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

వీటిలో ఎక్కువ మంది ఇష్టపడే వీడియోలు వివాహ సమయంలో సరదాగా ఉండే వీడియోలు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వివాహ ఆచారాలకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్(Viral) అవుతుంది. వివాహంలో వివిధ ఆచారాలు నిర్వహిస్తారు. చాలా సార్లు వీటిలో కొన్ని భిన్నమైన ఆచారాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు వధువు, వరుడు వారిని కారు వెనుక పరుగెత్తేలా చేస్తారు. కొన్నిసార్లు వరుడు తన వధువును తన ఒడిలోకి తీసుకుంటాడు. ప్రస్తుతం చర్చనీయాంశమైన వీడియోలో వధూవరులు చిన్నపిల్లల్లా పోట్లాడుకోవడం కనిపిస్తోంది. ఈ వీడియోలో వీరిద్దరూ కళ్యాణ మండపంలో కాకుండా రణరంగంలో కూర్చున్నట్లు కనిపిస్తోంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లో తేగుష్టి అనే ఖాతాతో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న వీడియోలో... వధూవరులు పెళ్లి మండపంలో కూర్చొని ఏడు జన్మలు కలిసి ఉండాలని ప్రమాణం చేస్తున్నారు. ఇంతలో, వధూవరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి వస్తుంది. వీడియోలో.. వరుడు వధువును ఆమెకు నచ్చని విషయంపై ఆటపట్టిస్తున్నట్లు కనిపించింది. వెంటనే ఇద్దరి మధ్య గొడవ మొదలయింది. చిన్న పిల్లల మాదిరిగా పెళ్లి వేడుకలో కొట్టుకుంటున్న వధూవరులని ఈ వీడియోలో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వేలల్లో లైక్ లు, ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ పెళ్లి నేపాల్ లో జరిగినట్లుగా అర్థమవుతోంది.

First published:

Tags: Crime news, Odisha, Viral Video

ఉత్తమ కథలు