దేశంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయి. కామాంధుల ఆగడాలకు అభం శుభం తెలియని మహిళల నిండు జీవితాలు బలవుతున్నాయి. మనిషి రూపంలో ఉన్న మానవ మృగాలు ముక్కుపచ్చలారని చిన్నారుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వావి వరస మరిచిన మృగాలు క్షణిక సుఖం కోసం అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో ఘోరం చోటు చేసుకుంది. హయత్ నగదు పరిధిలోని 30 అన్నారం వైఎస్సార్ కాలనీలో టెన్త్ క్లాస్ విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులే లైంగిక దాడికి పాల్పడ్డారు.
అంతేకాదు ఈ అత్యాచారాన్ని వీడియో తీసి విద్యార్థిని బెదిరించసాగారు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ వీడియోలు సోషల్ మీడియాలో పెడతా అంటూ విద్యార్థిని బెదిరించారు. ఈ క్రమంలో మరో 10 రోజుల తర్వాత కూడా బెదిరించి రేప్ కు పాల్పడ్డారు. చివరకు ఈ విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియగా..పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థిని ఇంట్లోనే దారుణం..
వైఎస్సార్ కాలనిలో ఉంటున్న ఓ విద్యార్థిని పదో తరగతి చదువుతుంది. అయితే ఆమె పదో తరగతిలో ఉన్నా కూడా ఐదో తరగతి విద్యార్థినిలాగా ప్రవర్తించేంది. ఆమె ప్రవర్తన చిన్న పిల్లల్లాగా ఉండేదని తెలుస్తుంది. దీనిని ఆసరాగా చేసుకున్న ఐదుగురు విద్యార్థులు స్కూల్లో హెగ్జామ్ అనంతరం బాలిక ఇంటికి వచ్చారు. నోట్ బుక్స్ కోసమే తాము వచ్చినట్టు విద్యార్థులు తెలిపారు. అయితే వాళ్లు చెప్పింది నిజమని భావించిన విద్యార్థిని ఇంట్లోకి రమ్మని చెప్పింది. ఈ క్రమంలో ఆ ఐదుగురు విద్యార్థులు ఆ బాలికను బలవంతంగా రేప్ చేశారు. నిందితుల్లో ఒకరు ఈ దారుణాన్ని వీడియో తీశాడు. ఎవరికైనా ఈ విషయం చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఆ తరువాత వీడియోలను మిగతా విద్యార్థులకు పంపించారు. ఈ విషయం తల్లదండ్రులకు తెలియగా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.
మార్పు ఎప్పుడు?
దేశం రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. టెక్నాలజి కొత్త పుంతలు తొక్కుతుంది. అలాంటిది చదువుకోని మంచి పేరు తెచ్చుకొని తల్లిదండ్రులకు బాసటగా నిలవాల్సిన విద్యార్థులు అత్యాచారానికి పాల్పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కామాంధుల్లో మార్పు రావడం లేదు. రోజుకు ఎన్నో ఘటనలు జరుగుతున్న పరువు కోసం, ప్రాణాల కోసం భయపడి బయటకు చెప్పలేని ఘటనలు ఎన్నో.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Hyderabad, Students, Telangana, Telangana crime news, Telangana News