5 స్టార్ హోటల్‌లో రూం బుక్... తీరా అక్కడకు వచ్చాక షాక్

Horrible holiday : బ్రిటన్‌కు చెందిన ఆ ఫ్యామిలీ... రెండు వారాలు హాలిడే తీసుకొని... ఎన్నో ఆశలతో... ఈజిఫ్ట్ వచ్చింది. తీరా అక్కడకు వచ్చాక ఏమైంది?

news18-telugu
Updated: November 17, 2019, 11:29 AM IST
5 స్టార్ హోటల్‌లో రూం బుక్... తీరా అక్కడకు వచ్చాక షాక్
5 స్టార్ హోటల్‌లో రూం బుక్... తీరా అక్కడకు వచ్చాక షాక్ (File)
  • Share this:
Horrible holiday : విదేశీ హాలిడే ట్రిప్‌లు కొన్ని సందర్భాల్లో కాళరాత్రులు అవుతుంటాయి. ఇది అలాంటిదే. ఏం జరిగిందంటే... ఈజిఫ్టుకు వచ్చిన ఐదుగురు సభ్యుల బ్రిటన్ ఫ్యామిలీ... తాము బుక్ చేసుకున్న 5 స్టార్ హోటల్‌కి క్యాబ్‌లో చేరారు. అక్కడికీ ఆ క్యాబ్ డ్రైవర్ చెబుతూనే ఉన్నాడు... అలాంటి పేరున్న హోటల్... ఆ ఎడ్రెస్‌లో లేదని. వాళ్లు నమ్మలేదు. రూమ్ బుక్ చేసుకున్నాక... హోటల్ లేకుండా ఎలా ఉంటుంది అని ఎదురు ప్రశ్నించారు. తీరా... ఆ అడ్రెస్‌కి వెళ్లి చూస్తే... నిజంగానే అక్కడ ఆ హోటల్ లేదు. ట్రావెల్ కంపెనీ లవ్ హాలిడేస్ ద్వారా... 5 స్టార్‌ హోటల్‌లో రూమ్ కోసం... మార్క్ మౌల్డ్ (33) ఏకంగా రూ.3.2లక్షలు చెల్లించారు. రెండు వారాలు ఆన్‌లైన్‌లో రూమ్ అద్దెకు తీసుకున్నారు. హోటల్ పేరు క్రిస్టల్ బీచ్ ఆక్వా పార్క్ అండ్ హోటల్.

బీచ్ పక్కన, వాటర్ పార్క్స్ పక్కనే హోటల్ ఉంది కదా అని బుక్ చేసుకుంటే... అసలు విషయం అక్కడకు వెళ్లాక తెలిసింది. ఇంకా ఆ హోటల్ నిర్మించలేదని దాని మేనేజర్లు తెలిపారు. మరి నిర్మించకుండా... ఆన్‌లైన్‌లో యాడ్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తే... మీరేం వర్రీ కాకండి... మీకు ఆల్నరేట్ ఎకామడేషన్ ఇస్తాం అంటూ... వేరే చోట మరో హోటల్‌లో రూమ్ ఇచ్చారు. అది చూస్తే... ఫర్నిచర్ పగిలిపోయి ఉంది. ఫ్లోర్ మురికిగా ఉంది. దాదాపు కూలిపోయేలా ఉంది ఆ హోటల్.

చిర్రెత్తుకొచ్చిన టూరిస్టులు కంప్లైంట్ ఇవ్వాలని డిసైడయ్యారు. ఈ విషయం తెలుసుకున్న హోటల్ యాజమాన్యం... రెండ్రోజుల తర్వాత వాళ్లను మరో హోటల్‌కి షిఫ్ట్ చేసింది. అదీ బాగోకపోవడంతో... కుదరదన్న ఆ ఫ్యామిలీ... తమ డబ్బు తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. సరేనని డబ్బు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేశారు. అందులో... రూ.7.4 లక్షలు పెండింగ్ పెట్టారు. ఆ డబ్బు ఎప్పుడిస్తారని అడిగితే... సమాధానం లేదు.

ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్ అయిన మార్క్ తాము అడ్డంగా మోసపోయామనీ, తమ హాలిడే కాస్తా... పీడకలలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోసగాళ్లకు ఏమాత్రం నీతీ, నిజాయితీ లేదని మండిపడ్డారు. తిరిగి వెళ్లిపోదామని ఓ బస్ ఎక్కిన ఆ ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాల్సిన ఆ బస్సు ఓ హోటల్ దగ్గర ఆగిపోయింది. ఫ్లైట్‌కి టైమ్ అయిపోతుండటంతో... వాళ్లు బస్సు దిగి... టాక్సీ ఎక్కాల్సి వచ్చింది. ఈజిఫ్ట్ వెళ్లాక... ట్రావెల్ సంస్థను ఒత్తిడి చెయ్యడంతో... కొన్ని రోజుల తర్వాత మూడో హోటల్... రూ.7.4 లక్షలకు బదులు... రూ.4.57 లక్షలు మాత్రమే ఇచ్చింది. ఇలా ఆ ఫ్యామిలీ... దాదాపు రూ.3లక్షలు పోగొట్టుకొని... హాలిడే సెలవుల్ని కోల్పోయి... అన్ని విధాలా నష్టపోయింది. దేశం కాని దేశంలో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఆ ఫ్యామిలీకి సారీ చెప్పిన ట్రావెల్ సంస్థ... తమ వెబ్‌సైట్ నుంచీ ఆ నకిలీ హోటల్‌ను తొలగించినట్లు తెలిపింది.

 

Pics : మోడలింగ్‌లో మెరుస్తున్న జారా యాస్మిన్


ఇవి కూడా చదవండి :

డయాబెటిస్ కంట్రోల్ అయ్యేందుకు ఇంటి చిట్కాలు...


Video : స్నేహా ఉల్లాల్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?

Pics : రోజూ వాడే వస్తువులే కేకులు... న్యూజెర్సీ బేకర్ ప్రతిభ


Weight Loss : శీతాకాలంలో బరువు పెరగకుండా ఉండటం ఎలా?


Viral Video : వీరాభిమానిని కాపాడిన విరాట్ కోహ్లీ...

Viral Video : ఊర్వశీ? స్వప్నా?... ఎవరు బాగా డాన్స్ చేశారు?
Published by: Krishna Kumar N
First published: November 17, 2019, 11:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading