పబ్‌జీ ఆడొద్దన్నందుకు భర్తపై కోపం... విడాకులు కోరిన భార్య

Gujarat - PUBG : ఎప్పుడైనా విన్నామా ఇలాంటివి... ఇప్పుడు మాత్రం జరుగుతున్నాయి. ఓ ఆట కోసం భర్తను వదిలేసుకోవడానికి సిద్ధమైందంటే ఏమనుకోవాలి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 7:38 AM IST
పబ్‌జీ ఆడొద్దన్నందుకు భర్తపై కోపం... విడాకులు కోరిన భార్య
పబ్‌జీ గేమ్ (Image : Twitter)
Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 7:38 AM IST
వయసు అంతా కలిపి 19 ఏళ్లు. అప్పుడే పెళ్లైపోయింది. ఓ పాప కూడా ఉంది. భర్తతో కలిసి జీవితాన్ని పంచుకోకుండా... ఆన్‌లైన్ గేమ్ PUBG (ప్లేయర్ అన్ నౌన్ బ్యాటిల్ గ్రౌండ్) ఆడటం మొదలుపెట్టింది. క్రమంగా దానికి బానిసైపోయింది. అంటే ఆట ఆడకపోతే ఇక బతకలేను అనేంతగా కనెక్ట్ అయిపోయింది. భర్త మంచివాడు. ఆమెతో ఎంతో చక్కగా ఉంటున్నా్డు. అలాంటిది ఆమె మాత్రం పబ్‌జీ మత్తులో చిక్కి... పిల్లను, మొగుడినీ పట్టించుకోవడం మానేసింది. ఎప్పుడు చూసినా ఆ మొబైల్‌లో ఆటాడుకుంటూనే కనిపిస్తుంది. అందుకే భర్త అప్పుడప్పుడూ సీరియస్ అవుతున్నాడు. ఆ తొక్కలో గేమ్ ఆడకపోతే ఏమవుతుందని అని అంటున్నాడు. ఇంతలో ఓ రోజు 181 అభయం మహిళా హెల్ప్‌లైన్‌కి కాల్ చేసింది. తనకు విడాకులు కావాలని అడిగింది. భర్తతో కాపురం చెయ్యలేకపోతున్నాననీ, తనను మహిళా అబ్జర్వేషన్ హోంకి పంపించమని అడిగింది. వాళ్లేమనుకున్నారంటే... భర్త ఆమెను వేధిస్తున్నాడేమో, అందుకే విడాకులు అడుగుతోంది అనుకున్నారు. అసలు ఆమె ఉద్దేశం వేరు. ఆమెను ప్రత్యేక హోంలో పడేస్తే... భర్త, ఫ్యామిలీ, పేరెండ్స్ ఇలా అందరికీ దూరంగా ఉంటూ, రోజంతా పబ్ జీ ఆడుకోవచ్చని అనుకుంది. పేరెంట్స్ దగ్గరకు వెళ్తే, వాళ్లు మొబైల్ లాగేసుకుంటున్నారట. అ ఇంతకంటే దారుణం ఉంటుందా?

అబ్జర్వేషన్ హోమ్‌లో మొబైల్ గేమ్స్ అడుకోనిపవ్వరని ఆ సంస్థ వాళ్లు చెప్పడంతో... ఆ ఆలోచన మానుకుంది. పబ్‌జీ గేమ్‌లో తనతోపాటూ ఆడుతున్న అమ్మాయికి ఫోన్ చేసింది. మీ ఇంటికి వచ్చేస్తా, ఇద్దరం కలిసి పబ్ జీ ఆడుకుందాం అని చెప్పింది. ఆ ఫ్రెండుకి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఇలాంటి బలమైన నిర్ణయాలు తీసుకోవద్దని కౌన్సిలర్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. పెళ్లైన రెండేళ్లకే విడాకులు కోరడం కరెక్టు కాదన్నారు. పైగా పుట్టిన పాపకు భవిష్యత్తులో సమస్యలొస్తాయని సూచించారు.

మొత్తం 4 గంటలపాటూ కౌన్సెలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికి గానీ భర్తతో కలిసుండటానికి ఒప్పుకోలేదు. భవిష్యత్తులో ఏదైనా సమస్య ఉంటే తమకు కాల్ చెయ్యమన్నారు.

ఈ పబ్‌జీ గేమ్‌ని దక్షిణ కొరియాలోని వీడియో గేమ్ కంపెనీ బ్లూహోల్ తయారుచేసింది. దీన్ని గూగుల్ ప్లే ద్వారా ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పింది. అందుకే అందరూ ఆడుతున్నారు. ఐతే దీన్ని నేపాల్, ఇరాక్‌‌లో బ్యాన్ చేశారు. ఇండియాలో రోజుకు 6 గంటలు మాత్రమే ఆడాలనే నిబంధన ఉంది.



 

ఇవి కూడా చదవండి :

నేడు అమరావతికి జగన్... బీజేపీ లేదా కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై చర్చ
Loading...
ఏపీలో సంకీర్ణమే... గ్రహాలు అలా ఉన్నాయి... పవన్ మద్దతు అవసరమే...

ఇస్రో మరో విజయం... నింగిలోకి రీశాట్-2బీ... సరిహద్దులపై రాడార్ నిఘా...

Photos : అమాయక చూపులతో కట్టిపడేస్తున్న ముంబై బ్యూటీ...
First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...