• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • HOOCH TRAGEDY 15 DEAD IN SAHARANPUR 12 IN HARIDWAR AFTER CONSUMING SPURIOUS LIQUOR SK

సారా తాగి నిద్రలోనే...కల్తీ మద్యం కాటుకు 38 మంది బలి

సారా తాగి నిద్రలోనే...కల్తీ మద్యం కాటుకు 38 మంది బలి

భారత్‌లో తయారైన విదేశీ మద్యం 1000 ఎంఎల్ మీద రూ.300

సారా మరణాలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించారు.

  • Share this:
    యూపీ కల్తీ సారా మరణ మృందంగం మోగిస్తోంది. రాత్రి మందు తాగిన వాళ్లు ఉదయానికల్లా శవాలుగా మారుతున్నారు. మరికొందరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. సారా కాటుకు గురువారం ఒక్క సహారన్‌పూర్ జిల్లాలోనే 15 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రిలో చేరారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో కలిపి ఇప్పటివరకు మొత్తం 38 మంది చనిపోయారు. సారా మరణాలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాడు.

    శుక్రవారం సహారన్‌పూర్ ఉమాహి గ్రామంలో ఐదుగురు చనిపోయారు. మరో పది మంది ఆస్పత్రి పాలయ్యారు. అటు షర్బత్‌పూర్ గ్రామంలో మరో ముగ్గురు మరణించారు. మరికొందరు ఆస్పత్రిలో చేరారు. వీరంతా గురువారం రాత్రి సారా తాగినట్లు తెలుస్తోంది. ఈ మరణాలతో జిల్లాలో కల్తీ సారా బాగోతం వెలుగులోకి వచ్చింది.

    మూడు రోజుల క్రితం ఈస్ట్ యూపీలోని కుషినగర్‌లోనూ 10 మంది మృత్యువాతపడినట్లు అధికారులు వెల్లడించారు. మోని అమావాస్య మేలా సందర్భంగా గ్రామస్తులు మద్యం తాగి వేడుకలు జరుపుకున్నారు. ఐతే సారా తాగిన వారిలో చాలా మంది నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలంరేపింది. జిల్లా SHOతో పాటు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌పై వేటుపడింది. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కుషినగర్ విషాదం మరవకముందే ఇప్పుడు సహారన్‌పూర్‌లోనూ వరుస సారా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

    యూపీ పక్క రాష్ట్రం ఉత్తరాఖండ్‌లోనూ పలువురు కల్తీసారా కాటుకు బలయ్యారు. హరిద్వార్ జిల్లాలోని ఓ గ్రామంలో 12 మంది చనిపోయారు. మరో 8 మంది ఆస్పత్రి పాలయ్యారు. బాధితులంతా గురువారం రాత్రి సారా తాగినట్లు అధికారులు గుర్తించారు. ఓ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రాత్రి మద్యం తాగారని..తెల్లారేసరికి శవాలుగా మారారని గ్రామస్తులు చెప్పారు. సారా మరణాల నేపథ్యంలో ఆలస్యంగా మేల్కొన్న ఎక్సైజ్ అధికారులు..నష్ట నివారణ చర్యలు చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేస్తూ..కల్తీసారాపై ఉక్కుపాదం మోపుతున్నారు.
    First published: