Man murders sister and her husband : పరువు హత్యలు(Honour Killing)ఆగటం లేదు. ఇతర కులస్తుడిని, మతస్తుడిని ప్రేమించిన పాపానికి నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు కొందరు వ్యక్తులు. ఇటీవల హైదరాబాద్ సరూర్ నగర్, బేగంబజార్‌లలో జరిగిన పరువు హత్యలు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటికి మెన్న కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో... వేరే కులం అబ్బాయిని ప్రేమించిన పాపానికి ఓ బాలిక పొలంలో శవమై తేలింది. కన్నతండ్రే కూతురు గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ఆమె ప్రియుడు నివసిస్తున్న గ్రామంలోని వ్యవసాయ భూమిలో పడేసి వచ్చాడు. అనంతరం పోలీసు స్టేషన్ కు వెళ్లి తన కుమార్తెను హత్య చేసినట్లు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోయాడు. ఇదిలా ఉండగా,తమిళనాడు ఇప్పుడు మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. వేరే కులం వాడిని పెళ్లి చేసుకున్న ఓ యవతిని సొంత సోదరుడు దారుణంగా హత్య చేశాడు. పెళ్లైన ఐదు రోజులకే ఈ దారుణానికి ఒడిగట్టాడు. తమిళనాడులోని తంజావూరు(Thanjavur)జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
తమిళనాడు(Tamilnadu) రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోని కుంభకోణం(Kumbankonam)సమీపంలోని తులుక్కవేళి గ్రామానికి చెందిన 24 ఏళ్ల శరణ్య.. చెన్నైలో నర్సు(Nurse)గా పనిచేస్తోంది. ఇటీవల శరణ్య అనారోగ్యంతో ఉన్న తన తల్లిని ట్రీట్మెంట్ కోసం చెన్నైలో తను పనిచేసే హాస్పిటల్ కు తీసుకెళ్లింది. అయితే అదే హాస్పిటల్ లో తన బంధువుకి తోడుగా వచ్చిన మోహన్ అనే వ్యక్తితో శరణ్యకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచమం కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరూ కుటంబసభ్యులకు చెప్పారు. అయితే కుటుంబసభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు. శరణ్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది కాగా.. మోహన్ నాయకర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఇదే క్రమంలో శరణ్య సోదరుడు శక్తివేల్.. ఆమెకు తన ఫ్రెండ్ రంజిత్(28)తో పెళ్లి చేయాలనుకున్నాడు. ఈ విషయం శరణ్యకు చెప్పగా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఏడు జన్మలా,ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు మాకొద్దు.. వ్రతం చేసిన భార్యబాధితులు
గతవారం శరణ్య..తాను ప్రేమించిన మోహన్ నే చెన్నైలో పెళ్లి చేసుకుంది. అనంతరం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తాను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకున్నానని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన శరణ్య సోదరుడు శక్తివేల్.. వారి హత్యకు ప్లాన్ చేశాడు. తమ ఇంటికి డిన్నర్ కి రావాలంటూ నూతన జంటను ఆహ్వానించాడు. సోమవారమే తులుక్కవేళికి వచ్చిన దంపతులు శక్తివేల్ ఇంట్లో భోజనం చేశారు. కొద్దిసేపటి తర్వాత చెన్నై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పుడే శక్తివేల్, రంజిత్ ఇద్దరూ శరణ్య, మోహన్‌ను వెంటాడి దాడిచేశారు. తీవ్రగాయాలపాలైన ఇరువురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Garbage Bank : చెత్త బ్యాంక్ ఏర్పాటు..కిలో చెత్త ఇస్తే 6 రూపాయలు ఇస్తారు
తంజావూరు పోలీసు సూపరింటెండెంట్ జి. రవళి ప్రియ మాట్లాడుతూ... శక్తివేల్ మరియు రంజిత్‌లు ఇద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారని, తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు నుంచి సమాచారం సేకరించిన తర్వాత పూర్తి ఛార్జిషీటును కోర్టుకు అందజేస్తామని ఆమె తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Honor Killing, Tamilnadu