హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad Honour Killing: హైదరాబాద్ హేమంత్ హత్య కేసులో మరో కోణం... దర్యాప్తులో తేలిన వాస్తవం

Hyderabad Honour Killing: హైదరాబాద్ హేమంత్ హత్య కేసులో మరో కోణం... దర్యాప్తులో తేలిన వాస్తవం

హేమంత్-అవంతి పెళ్లి ఫొటో(Photo Credit - Twitter)

హేమంత్-అవంతి పెళ్లి ఫొటో(Photo Credit - Twitter)

Hyderabad Hemanth Murder Case: ఓ కాపురాన్ని సర్వనాశనం చెయ్యడానికి, ఆ జంటను విడగొట్టడానికి ఎన్ని కుట్రలు పన్నాలో అన్నీ పన్నారా? తాజాగా ఏం తెలిసింది?

  Hyderabad Hemanth Murder Case: ప్రేమ పెళ్లి చేసుకున్న హేమంత్ అనే యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన... పరువు హత్య కేసులో మరో విషయం బయటికొచ్చింది. పోలీసుల దర్యాప్తులో కొత్తగా ఏం తెలిసిందంటే... హత్యకు కొన్ని నిమిషాల ముందు... హేమంత్ భార్య అవంతి... మేనమామ యుగేందర్... హేమంత్‌ని ఒక్కటే అడిగాడు. "అవంతిని వదిలేయాలంటే నీకు ఎంత కావాలి?" ఈ ప్రశ్న అడిగినప్పుడు యుగేందర్‌తో సుపారీ కిల్లర్లు ఉన్నారు. అందరూ హేమంత్ వైపు చూశారు. హేమంత్... తనకు ప్రాణం ఉన్నంత వరకూ అవంతిని వదిలే ప్రసక్తే లేదన్నాడు. అయితే... ఆ ప్రాణం తీసేస్తాం అంటూ... అతన్ని అత్యంత దారుణంగా చంపేశారు యుగేందర్ అండ్ బ్యాచ్.

  ప్రేమ పెళ్లి చేసుకున్న తమను.... తమ బంధువులు తమ తల్లిదండ్రులతో కలుపుతారని అనుకున్నాననీ.. కానీ వాళ్లు నమ్మించి మోసం చేశారని అవంతి ఆవేదన వ్యక్తం చేసింది. హేమంత్‌ను చంపిన వాళ్లను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు కుమారుడి మృతితో హేమంత్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కేవలం కులం కారణంగా తమ బిడ్డను పొట్టన బెట్టుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.

  "మేం ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నాం... పెద్దలు మా పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోయాను. ఈ ఏడాది జూన్, హేమంత్, నేనూ 10న పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత చందానగర్ పోలీస్ స్టేషన్‌లో సెటిల్‌మెంట్ జరిగింది. నా పేరిట ఉన్న రూ.20 కోట్ల ఆస్తులను కుటుంబ సభ్యులకు రాసి ఇచ్చాను. అప్పటి నుంచి గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాం. మొన్న సాయంత్రం మా మేనమామతో పాటు మరికొందరకు మమ్మల్ని కిడ్నాప్ చేశారు. మేము ఇద్దరం మధ్యలో కారులో నుంచి దూకేశాం. కానీ వాళ్లు నన్ను అక్కడే వదిలేసి... హేమంత్‌ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. మా మేనమామ, బంధువులే ఈ హత్య చేయించారు. నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకుంటే నన్నుచంపాలి. కానీ హేమంత్‌ను పొట్టనపెట్టుకున్నారు. నన్ను పెళ్లి చేసుకోకుంటే హేమంత్ బతికేవాడు" అని కన్నీటి సంద్రమైంది అవంతి.

  "హేమంత్‌ను చంపిన వాళ్లు ఎవరైనా సరే... వాళ్లను ఎన్‌కౌంటర్ చెయాలి. నల్గొండ జిల్లాలో ప్రణయ్‌ను హత్య చేసిన మారుతీరావు చివరకు ఏమయ్యారో అందరం చూశాం" అని అవంతిక తెలిపింది. ఈహత్య కేసుకు సంబంధించి 13 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. యువతి తండ్రి లక్ష్మారెడ్డి, బంధువులే ప్రధాన పోషించారని అన్నారు. తమకు సమాచారం వచ్చినవెంటనే స్పందించామని స్పష్టం చేశారు.

  కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడంపై యువతి తండ్రి ఆగ్రహించాడు. హేమంత్‌ను ఎలాగైనా అంతమొందించాలని అనుకున్నాడు. కిరాయి గుండాలతో అతన్ని హత్య చేయించాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే గురువారం హేమంత్‌ను కొందరు వ్యక్తులతో కిడ్నాప్ చేయించాడు. తర్వాత సంగారెడ్డిలో హేమంత్‌ను దారుణంగా చంపేశారు. హేమంత్‌ను కిడ్నాప్ చేసే సమయంలో అక్కడి నుంచి తప్పించుకున్న అవంతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంగారెడ్డి జిల్లా కిష్టాయిగూడెంలో సమీపంలోని చెట్లలో హేమంత్ మృతదేహాన్ని కనుగొన్నారు. తర్వాత పోస్ట్ మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని నగరానికి తరలించారు. అలాగే ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Crime news, Honor Killing

  ఉత్తమ కథలు