Karnataka Honour Killing : పరువు హత్యలు(Honour Killing)ఆగటం లేదు. ఇతర కులస్తుడిని, మతస్తుడిని ప్రేమించిన పాపానికి నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు కొందరు వ్యక్తులు . ఇటీవల హైదరాబాద్ సరూర్ నగర్, బేగంబజార్‌లలో జరిగిన పరువు హత్యలు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో పరువు హత్య వెలుగు చూసింది. వేరే కులం అబ్బాయిని ప్రేమించిన పాపానికి ఓ బాలిక పొలంలో శవమై తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మైసూరు(Mysore) జిల్లాలోని కగ్గుండి గ్రామానికి చెందిన సురేష్, బేబీ దంపతుల కుమార్తె షాలిని (17) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే షాలిని పొరుగు గ్రామం మేళ్లహళ్లికి చెందిన మంజు అనే దళిత యువకుడితో ప్రేమలో పడింది. వీరి ప్రేమను షాలిని తల్లిదండ్రులు నిరాకరించారు. కుమార్తెను కట్టడి చేశారు. దీంతో ఒకరోజు మంజు, షాలిని ఇంట్లోంచి పారిపోయారు. షాలిని తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసలు ప్రేమికులిద్దరినీ గాలించి పట్టుకొచ్చారు. ఈక్రమంలో షాలిని పోలీసు స్టేషన్‌లో తాను మంజు మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని తాను అతనితోనే ఉంటానని తేల్చి చెప్పింది. మైనర్ బాలిక కావటంతో పోలీసులు షాలినిని బాలసదన్ కు అప్పచెప్పారు. బాలసదన్ లో ఉన్న షాలిని తల్లి తండ్రులకు ఫోన్ చేసి తనను ఇంటికి తీసుకువెళ్ళమని కోరింది. దీంతో సురేష్ దంపతులు బాలసదన్ కు వచ్చి తమ కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లారు.
Train Derailment : పట్టాలు తప్పిన రైలు..21 మంది మృతి,50 మందికి పైగా గాయాలు
Son kills mother: PUBG ఆడొద్దన్నందుకు తల్లిని కాల్చి చంపిన బాలుడు..అనుమానం రాకుండా..
తమ కుమార్తెను ఇంటికి తీసుకెళ్తామని సురేశ్, బేబీ దంపతులు చెప్పడంతో బాలసదన్ నిర్వాహకులు అంగీకరించారు. ఇంటికి వచ్చిన కొద్దిరోజులకు షాలిని మళ్లీ తాను మంజును ప్రేమిస్తున్నానని, అతనితో వివాహం జరిపించమని మళ్లీ తల్లిదండ్రులను కోరింది. దీంతో కుమార్తెకు నచ్చజెప్పేందుకు తల్లిదండ్రులు చాలారకాలుగా ప్రయత్నించారు. అయితే షాలిని వారి మాట వినలేదు. తాను మంజునే ప్రేమించానని,పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకుంటా అని పట్టుబడ్డింది.
దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి సురేష్ సోమవారం తెల్లవారుఝూమున కూతురు షాలిని గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని మంజు నివసిస్తున్న మేళహళ్లి గ్రామంలోని వ్యవసాయ భూమిలో పడేసి వచ్చాడు. మంగళవారం ఉదయం పెరియపట్నం పోలీసు స్టేషన్ కు వెళ్లి తన కుమార్తెను హత్య చేసినట్లు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేళహళ్లి గ్రామానికి వెళ్లి షాలిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Honor Killing, Karnataka