భార్యతోనే పాడు పనులు.. డబ్బుల కోసం మరీ ఇలా చేస్తారా.. హనీ ట్రాప్ ముఠా వెనక సంచలన నిజాలు..

ప్రతీకాత్మక చిత్రం

ఆ సమయంలో ఇతర ముఠా సభ్యులు వారిని కొట్టి పోర్న్ వీడియోలు చేసేవారు. తర్వాత వారిని రేప్ కేసులో ఇరికిస్తామని.. అసభ్యకరమైన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి డబ్బు డిమాండ్ చేసేవారు.

 • Share this:
  పోలీసులు హనీ ట్రాప్ ముఠా గుట్టును రట్టు చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరు మహిళలు, ఒక పురుషుడికి అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన మిగతవారి కోసం పోలీసు బృందాలు గాలింపు జరుపుతున్నాయి. ఈ ఘటన రాజస్తాన్‌లోని పాలి నగరంలో వెలుగుచూసింది. డబ్బులు ఉన్నవారిని గుర్తించి.. వారితో పరిచయం పెంచుకుని, ఆ తర్వాత అశ్లీల వీడియోలు చిత్రీకరించి.. వారిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు దండుకోవడమే ఈ ముఠా పని. అయితే ఈ కేసు విచారిస్తున్న పోలీసులుకు షాకింగ్ నిజం తెలిసింది. ఇతరులను హనీ ట్రాప్ చేసేందుకు.. నిందితుడు తన భార్యను ఎరగా వేస్తున్నట్టుగా తేలింది. ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులు లక్ష్యంగా దందా సాగిస్తుందని పోలీసులు గుర్తించారు. వీరి చేతిలో పలువురు మోసపోయారని.. అయితే అపఖ్యాతికి భయపడి బాధితులు ఈ విషయాలను వెల్లడించలేదు.

  ఈ ముఠాకు చెందిన సభ్యులు.. మహిళలతో లక్ష్యంగా చేసుకున్నవారికి గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుంచి కాల్స్ చేయించేవారు. వారితో పరిచయం పెంచుకుని సమావేశం నెపంతో.. ఇంటికి పిలిచేవారు. ఆ సమయంలో ఇతర ముఠా సభ్యులు వారిని కొట్టి పోర్న్ వీడియోలు చేసేవారు. తర్వాత వారిని రేప్ కేసులో ఇరికిస్తామని.. అసభ్యకరమైన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి డబ్బు డిమాండ్ చేసేవారు.

  అయితే జూలై 29న ఈ ముఠాలో ప్రధాన నిందితుడిగా ఉన్న రమేష్ భార్య.. మహిళా భద్రతా సహాయ సంస్థతో అనుబంధంగా ఉన్న చేతన్ చౌహాన్‌ను సంప్రదించింది. తాను రమేష్ అనే వ్యక్తిని నాలుగు నెలల క్రితం(ఏప్రిల్ 2, 2021) ప్రేమించి పెళ్లి చేసుకున్నానని.. కానీ ఇప్పుడు అతనితో కలిసి జీవించేందుకు ఇష్టపడటం లేదని తెలిపింది. దీంతో ఆమెను మహిళా భద్రతా సహాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు కుల్‌దీప్ పన్వర్, ప్రతినిధి నేహా శ్రీమాలి మరియు ఇతర సభ్యులు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అయితే వారు అక్కడ ఎస్పీని కలవలేకపోయారు.

  దీంతో వారు న్యూ బస్టాండ్‌ అవుట్ పోస్ట్‌కు చేరుకుని అక్కడ అధికారికి జరిగిన విషయం మొత్తం చెప్పారు. అయితే అదే సమయంలో భావనకు ఆమె భర్త రమేష్ నుంచి నిరంతరం కాల్స్ రావడం మొదలైంది. దీంతో పోలీసుల సూచన మేరకు భావన.. అతడి ఫోన్ లిఫ్ట్ చేసింది. అనంతరం అతడిని న్యూ బస్టాండ్ ప్రాంతానికి రావాలని చెప్పింది. దీంతో రమేష్ అక్కడికి చేరుకోవడంతో.. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతని ఫోన్ తీసుకుని చూడగా.. అందులో అనేక అశ్లీల వీడియోలు కనిపించాయి.

  పోలీసులు అతడిని కఠినంగా ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. రమేష్ లాక్‌డౌన్‌కు ముందు ముంబైలో పనిచేసేవాడని తెలిసింది. అతడు లాక్‌డౌన్ సమయంలో రాజస్తాన్ వచ్చాడని.. డబ్బు సంపాదన కోసం మరికొందరితో కలిసి ఈ ముఠాను ప్రారంభించాడని పోలీసులు గుర్తించారు. ఇటీవలే పెళ్లి చేసుకన్న రమేష్.. భార్యతో కలిసి పాలిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడ. ఈ ముఠాకు సంబంధించిన మిగతావారి కోసం గాలింపు చేపట్టారు.
  Published by:Sumanth Kanukula
  First published: