Home /News /crime /

HONEY TRAP CASE IN ANDHRA PRDESH ONE WOMEN TRAPPED A MAN AND CHEATING RS 2 LAKHS IN BAPATLA NGS GNT

Honey trap: నెట్ బ్యాలెన్స్ లేదని చెప్పి రూ.20 రీఛార్జ్ చేయమని రిక్వెస్ట్ చేసింది.. కానీ రూ.2.50 లక్షలు మాయం.. ఏం చేసిందో తెలుసా?

ఏపీలో హనీ ట్రాప్ కలకలం

ఏపీలో హనీ ట్రాప్ కలకలం

Honey trap: అమ్మాయిలను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి చీట్ చేసే మోసగాళ్లు చాలామంది ఉంటారు.. అమ్మాయిల గురించి అప్పుడప్పుడూ వింటాం.. ఇది మరో లెవెల్.. నెట్ బ్యాలెన్స్ అయిపోయింది.. రీఛార్జ్ చేయించా అంటూ రిక్వెస్ట్ చేసింది. ఆ వెంటనే రెండున్నర లక్షల రూపాయలు మాయం.. ఏం జరిగిందంటే?

ఇంకా చదవండి ...
  Honey trap: ప్రేమ, పెళ్లి, స్నేహం పేరుతో మోసం చేసే మాయగాళ్ల గురించి నిత్యం వింటూ ఉంటాం.. ముఖ్యంగా సోషల్ మీడియా (Social Media) వేదికగా ఇలాంటి అరాచకాల గురించి వార్తలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా వలపు వల విసురుతున్నారు. ఇటీవల అలాంటి కిలేడీలు పెరిగిపోతున్నారు. తమ మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను అవకాశంగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. మాయమాటలతో వలపు వలవిసిరి లక్షలకు లక్షలు కాజేస్తున్నారు. తాజాగా ఓ హనీ ట్రాప్ (Honey Trap) ఘటన ఒకటి బాపట్ల (Bapatla)లో వెలుగులోకి వచ్చింది. నెట్ బ్యాలెన్స్ (Net Balance) అయిపోయింది.. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది అంటే.. తన ఫోన్ బ్యాలెన్స్ అయిపోంది.. వెంటనే 20 రూపాయలు తన ఖాతాకు పంపించమని ఆ యువతి రిక్వెస్ట్ చేసింది. సరే 20 రూపాయలే కదా..? అని ఆమెకు డబ్బులు పంపాడు.. కానీ కొద్ది నిమిషాల వ్యవధిలోనే యువకుడి ఖాతాలోనుంచి రెండున్నర లక్షల రూపాయలు మాయం చేసేసింది ఆ కిలాడీ లేడీ. కళ్ల ముందే బ్యాంక్ ఖాతాలో లక్షల్లో డబ్బులు పోయినప్పటికీ ఏమీ చేయలేక నిస్సాయస్థితిలోకి వెళ్లాడు యువకుడు.

  ఈ వలపు వల ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురంలో జరిగింది. జాంద్రపేటకు చెందిన దేవాన గణేష్ (Devana Ganesh) ఉద్యోగరిత్యా ఉంగుటూరు మండలం చేబ్రోలు వచ్చాడు. స్థానికంగా ఓ పరిశ్రమలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం ఫేస్ బుక్ ద్వారా ప్రీతి అనే పేరుతో ఓ యువతి పరిచయమైంది అతడికి. కొద్దిరోజుల చాటింగ్ లు చేసుకున్న వారి మధ్య చనువు ఏర్పడింది. గణేష్ నుండి ఎలాగైనా డబ్బులు కొట్టేయాలని పథకం పన్నిన యువతి.. వలపు వల విసరసాగింది. కొద్దిరోజుల తరువాత టెలిగ్రామ్ లో ఇద్దరూ సందేశాలు పంపుకున్నారు. వీడియో కాల్ చేసుకుందామని యువతి ఒక లింక్ ను గణేష్ ఫోన్ కు పంపించింది. ఆశతో గణేష్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రీతితో మాట్లాడటం మొదలు పెట్టాడు.

  ఇదీ చదవండి : ’క్విట్ జగన్-సేవ్ ఏపీ‘.. మహానాడులో సీఎంపై చంద్రబాబు నిప్పులు

  అయితే ఈ నెల 23వ తేదీన.. రోజు తనతో ప్రేమగా మాట్లాడేది.. తనతో ఫోన్ మాట్లాడకపోతే ఏదో మిస్ అయ్యాను అనే ఫీలింగ్ అతడికి కలిగేలా.. తియ్యగా మాట్లాడేది.. ప్రేమ కురిపించేంది. అయితే ఆ రోజు తన బ్యాలెన్స్ అయిపోయిందని.. ఫోన్ మాట్లాడడానికి కుదరడం లేదని.. వెంటనే తన బ్యాంక్ ఖాతాకు 20 రూపాయలు పంపించాలని యువతి గణేష్ ను కోరింది. కేవలం 20 రూపాయలే కదా అని అతడు ఏమీ ఆలోచించలేదు. అడిగిన క్షణంలోనే 20 రూపాయలు ఆమె ఖాతాకు పంపిచాడు. కానీ కాసేపటికే అతడి ఖాతాలో 2.50 లక్షలు వేరే అకౌంట్ కు సెండ్ అయ్యాయని మెస్సేజ్ రావడంతో కంగుతిన్నాడు.

  ఇదీ చదవండి : ఐపిఎల్ ముగిసిందని నో టెన్షన్.. ఏపీఎల్ సిద్దం.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ కు బీసీసీఐ అనుమతి.. ప్రత్యేకత ఏంటంటే?

  ఆ షాక్ లో వెంటనే బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయగా.. గణేష్ ఖాతాలో నుంచి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లోని ఓ బ్యాంకు ఖాతాకు బదలీ అయినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. అయితే రెండున్నర లక్షల రూపాయలు పోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తన దగ్గర ఉన్న ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ యువతి తిరిగి బెదిరింపులకు దిగింది. పోలీసులు గణేష్ నుండి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Gunturu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు