సరికొత్త హనీ ట్రాప్... ఇలా కూడా దోచేస్తున్నారా?

Honey Trap : తేనె పూసిన కత్తి స్మూత్‌గా ఉంటుంది. అలాగని టచ్ చేస్తే... కసక్కున కోసేస్తుంది. హనీ ట్రాప్ కూడా అలాంటిదే. తేనె పూసిన వల (హనీ ట్రాప్)... స్మూత్‌గా ఉంది కదా అని టచ్ చేస్తే... వల్లో చిక్కుకున్నట్లే. ఈ కథేంటో, ఎవరు ఎలా బుక్కయ్యారో తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 28, 2019, 10:27 AM IST
సరికొత్త హనీ ట్రాప్... ఇలా కూడా దోచేస్తున్నారా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Honey Trap : కర్ణాటకలో అదో సంపన్న ఫ్యామిలీ. కోట్ల రూపాయల డబ్బుంది. ఆ దంపతులకు ఓ కొడుకున్నాడు. కాలేజీలో చదువుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఓ 21 ఏళ్ల అందమైన అమ్మాయి వలపు వల విసిరింది. చూపులతో కవ్వించింది. అందాలతో కైపెక్కించింది. గురుడు ట్రాక్‌లోకి వచ్చాడు. ఇద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ మొదలైంది. కొన్ని రోజులకే... నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. తనకు ఈ ప్రేమలు, పెళ్లిళ్ల వంటివాటిపై నమ్మకం లేదంది. ఎందుకంటే... తన పేరెంట్స్ ఎప్పుడూ గొడవలు పడుతుంటారని కహానీలు చెప్పింది. మరైతే నాకెందుకు దగ్గరయ్యావ్ అనడిగాడు. నీతో ఎంజాయ్ చెయ్యాలని ఉంది. అతే తప్ప... పెళ్లి ఉద్దేశం లేదు అంది. లోలోపల తెగ ఆనందపడ్డాడు. నా పేరెంట్స్ కూడా నీతో పెళ్లికి ఒప్పుకోరులే అన్నాడు. చిన్నగా నవ్వింది. మెల్లగా అతన్ని తనవైపు తిప్పుకొని... అందాల వల్లో చిక్కుకునేలా చేసింది. ఆ రోజు రాత్రి వర్షం పడలేదు గానీ... ఇద్దరూ హద్దులు మీరారు. అందుకు సజీవ సాక్ష్యాలుగా ఆ హోటల్ గదిలోని సీక్రెట్ కెమెరాలు నిలిచాయి.

కట్ చేస్తే... నాల్రోజుల తర్వాత అతని తల్లికి కాల్ వచ్చింది. మా అమ్మాయిని మీ అబ్బాయి నాశనం చేశాడు. అందుకు సంబంధించి నా దగ్గర వీడియో సాక్ష్యాలున్నాయి. మర్యాదగా రూ.50 లక్షలు ఇస్తారా లేక... పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టి... నిర్భయ కేసులో పదేళ్లు జైల్లోకి నెట్టమంటారా అని అనడిగాడు ఆ వగలాడి తండ్రి. షాకైన కుర్రాడి తల్లి... విషయం కొడుకును అడిగింది. ముందు కాదన్నా... తర్వాత అవునని ఒప్పుకున్నాడు. ఇంట్లో పెద్ద రాద్దాంతం జరిగింది. తల్లిదండ్రులిద్దరూ కుర్రాణ్ని ఇష్టమొచ్చినట్లు తిట్టిపోశారు. సరే జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు. మన లాంటి డబ్బున్నవాళ్లం... ఏం చేసినా జాగ్రత్తగా ఉండాలి అని తండ్రి సినిమా డైలాగ్స్ చెప్పాడు.

ఈ బ్లాక్‌మెయిల్ ఉదంతంతో... ఐదు నెలల్లో రూ.42 లక్షలు కాజేశారు ఆ అమ్మాయి పేరెంట్స్. అక్కడితో అయిపోలేదు. మరో కోటి రూపాయలు డిమాండ్ చేశారు. మీ అబ్బాయి వల్ల మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది. కోటి ఇవ్వాల్సిందే అన్నారు. ఇక లాభం లేదు... వీళ్ల సంగతి తేల్చాల్సిందే అనుకున్న అబ్బాయి తల్లి... బెంగళూరు పోలీసుల్ని ఆశ్రయించింది. దాంతో ఈ మేటర్ బయటికొచ్చింది. పోలీసులు కాల్ డేటా ఆధారంగా... అమ్మాయి ఫ్యామిలీ మొత్తాన్నీ అరెస్టు చేసింది. అప్పుడు తెలిసిందో కొత్త విషయం.

అమ్మాయి తండ్రి ఓ డాక్టర్. సొంతంగా డేటింగ్ వెబ్‌సైట్ ప్రారంభించాడు. అందులో తన కూతురు ఎక్స్‌పోజింగ్ ఫొటోలను పోస్ట్ చేశాడు. ఆ సైట్ లింక్... ఆ సంపన్న ఫ్యామిలీకి చెందిన కుర్రాడి మొబైల్‌ వాట్సాప్ నంబర్‌కి పంపాడు. ఇలా నాలుగైదుసార్లు పంపాక... ఆ కుర్రాడు ఓ రోజు... ఆ సైట్‌లోకి వచ్చాడు. అలా ఆ అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ చేశాడు. ఇలా ఓ ప్లాన్ ప్రకారం... ఆ సంపన్న కుటుంబాన్ని ఈ డాక్టర్ ఫ్యామిలీ టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండమని రొటీన్ సూచన చేశారు బెంగళూరు పోలీసులు.


Pics : అందాల బాల శుభ పూంజా క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :బైక్ తోలిన కుక్క... నిజమే... కావాలంటే మీరే చూడండి

Diwali 2019 : ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం... అంతా పొగే...

TSRTC Strike : ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ... ఏం జరుగుతుంది?

Health Tips : మంట, నొప్పులను తరిమికొట్టే 7 అద్భుత ఆహారాలు

Health Tips : రోజూ 30 నిమిషాలు నడిస్తే...మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

Published by: Krishna Kumar N
First published: October 28, 2019, 10:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading