హోమ్ /వార్తలు /క్రైమ్ /

‘దిశ’ పోలీస్ స్టేషన్ హోంగార్డ్ నిర్వాకం... బాలికతో శృంగారం.. గర్భం రావడంతో...

‘దిశ’ పోలీస్ స్టేషన్ హోంగార్డ్ నిర్వాకం... బాలికతో శృంగారం.. గర్భం రావడంతో...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దిశ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఓ హోంగార్డ్ బాలికతో రాసలీలలు నడపడంతో ఆమె గర్భం దాల్చింది.

  అఘాయిత్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షించేందుకు, బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఓ హోంగార్డ్ మైనర్ బాలికతో రాసలీలలు నడిపాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా నిందితుడు ఆమెతో శృంగారం చేస్తుండగా, బాలిక గర్భం దాల్చడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, దిశ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే హోంగార్డ్ ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిసి పోలీసులు, ప్రజలు అవాక్కయ్యారు.

  AP CM ys jagan inaugurate disha police station in rajamundry
  పీలో తొలి దిశ పోలిస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం జగన్

  Disha SOS App: 'దిశ ఎస్ఓఎస్' యాప్ ఫీచర్స్ ఇవే...


  అమ్మాయిలు, మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ యాప్ తీసుకొచ్చింది. 'దిశ ఎస్ఓఎస్' యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైంది. మొదటిసారి డౌన్‌లోడ్ చేయడానికి మాత్రమే ఇంటర్నెట్ అవసరం. యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఉపయోగించడానికి ఇంటర్నెట్ అవసరం లేదు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్‌తో లాగిన్ చేయాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత సమాచారం, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లాంటి వివరాలు అప్‌డేట్ చేయాలి. ఆపదలో ఉన్నప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసి SOS బటన్ ప్రెస్ చేస్తే చాలు. యాప్ ఓపెన్ చేసి SOS బటన్ ప్రెస్ చేసేంత సమయం లేకపోతే ఫోన్‌ని గట్టిగా ఊపినా చాలు. మీరు ఎక్కడున్నారో లొకేషన్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది. అంతేకాదు... మీరు ఉన్న లొకేషన్ 10 సెకండ్ల వీడియో కూడా కమాండ్ రూమ్‌కు వెళ్తుంది. మీరు ఉన్న లొకేషన్ ఆధారంగా దగ్గర్లో అందుబాటులో ఉన్న పోలీస్ రక్షక్ వాహనాలకు, పోలీస్ స్టేషన్లకు సమాచారం వెళ్తుంది. పోలీస్ రక్షక్ వాహనాలు జీపీఎస్ ద్వారా మీరు ఉన్న ప్రాంతానికి చేరుకుంటాయి. మీరు ఆపదలో ఉన్నప్పుడు మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లో ఉన్న మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల నెంబర్లకు కూడా సమాచారం వెళ్తుంది.

  Disha App : దిశ యాప్ సెన్సేషన్... భార్యాభర్తల సమస్య పరిష్కారం...
  Disha App : దిశ యాప్

  యాప్ ఓపెన్ చేయగానే SOS బటన్‌తో పాటు నేరుగా 100 లేదా 112 నెంబర్‌కు కాల్ చేసేందుకు బటన్ ఉంటుంది. 100 నెంబర్‌కు నేరుగా కాల్ చేయొచ్చు. 112 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. ఇక యాప్‌లో ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ఉంటుంది. మీరు క్యాబ్‌లో, ఆటోలో వెళ్తున్నప్పుడు మీ గమ్యస్థానాన్ని అందులో ఎంటర్ చేయాలి. ఒకవేళ వాహనం వేరే రూట్‌లో వెళ్తున్నట్టైతే వెంటనే కంట్రోల్ రూమ్‌తో పాటు మీ కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్తుంది. యాప్‌లో పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్లు, దగ్గర్లోని పోలీస్ స్టేషన్ల వివరాలు కూడా ఉంటాయి. వీటితో పాటు దగ్గర్లోని ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఫార్మసీల వివరాలు కూడా దిశ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో దిశ యాప్‌కు 4.9/5 స్టార్ రేటింగ్ ఉండటం మరో విశేషం.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, AP Police, Disha Act 2019

  ఉత్తమ కథలు