Home /News /crime /

HIV POSITIVE WOMAN SEXUALLY ASSAULTS 15 YEAR OLD NEPHEW WITH AN INTENTION TO INFECT HIM IN UTTARAKHAND MKS

Shocking: ఆ మహాతల్లి ఎయిడ్స్ రోగి.. 15 ఏళ్ల కొడుకుపై లైంగికదాడి.. హెచ్ఐవీ అంటించాలనే చేసింది!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎయిడ్స్ వ్యాధిగ్రస్తురాలైన మహిళ 15 ఏళ్ల కొడుకుపై పలుమార్లు లైంగికదాడి చేసింది. పిల్లాడికి హెచ్ఐవీ అంటించాలనే దురుద్దేశంతోనే ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.

పిల్లలపై లైంగిక అకృత్యాలకు సంబంధించి ఇదివరకు కనీవినీ ఎరుగని దారుణ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎయిడ్స్ రోగి అయిన ఓ మహిళ కొడుకు వరసయ్యే 15 ఏళ్ల బాలుడిపై పలుమార్లు లైంగికదాడి చేసింది. పిల్లాడికి హెచ్ఐవీ అంటించాలనే దురుద్దేశంతోనే ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఉత్తరాఖండ్ లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన. స్థానిక పోలీస్ అధికారిణి రీటా చౌహాన్, బాధిత కుటుంబీకులు చెప్పిన వివరాలివి..

ఉధమ్ పూర్ జిల్లా కేంద్రంలో ఇద్దరు సోదరులు దగ్గర దగ్గరే నివసించేవారు. పెద్దోడికి చాలా ఏళ్ల కిందటే వివాహమై, 15 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. చిన్నోడు కొన్నేళ్ల కిందటే పెళ్లి చేసుకున్నాడు. చెడు తిరుగుళ్ల కారణంగా చిన్నోడు ఎయిడ్స్ వ్యాది బారినపడ్డాడు. అతని ద్వారా భార్యకు(23) కూడా హెచ్ఐవీ సోకింది. అయితే ఆ దంపతులు ఈ విషయాన్ని రహస్యంగా తమలోనే దాచుకున్నారు.

KCR | Rahul Gandhi: టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తుపై రాహుల్ గాంధీ కుండబద్దలు -కీలక నిర్దేశం


ఖరీదైన ట్రీట్మెంట్ పొందలేక వ్యాధి బాగా ముదరడంతో చిన్నోడు గతేడాది డిసెంబర్ లో ప్రాణాలు కోల్పోయాడు. కర్మల తంతులో భాగంగా అతని భార్యను కొన్నాళ్లపాటు పుట్టింటివాళ్లు తీసుకెళ్లారు. అయితే, పిన్నితో ఉన్న చనువు కారణంగా బాధిత బాలుడు మొన్నటి హోలీ పండుగ సెలవుల్లో ఆమె ఉంటోన్న ఊరికి వెళ్లాడు. అక్కడ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ మహిళ బాలుడిపై లైంగికదాడికి పాల్పడింది. ఈ విషయం బయటికి చెప్పొద్దని బెదిరిస్తూ తల్లి వరుసయ్యే ఆ మహిళ పలుమార్లు కొడుక్కి ప్రత్యక్ష నరకం చూపించింది. ఆ తర్వాత..

Sunil Kanugolu: డైలమాలో ప్రశాంత్ కిషోర్.. శిష్యుడు సునీల్ కనుగోలు దూకుడు.. కాంగ్రెస్‌లో చేరిక


హోలీ సెలవులు ముగిసిన తర్వాత బాలుడు అమ్మానాన్నల దగ్గరికి వచ్చేశాడు. నాలుగైదు రోజుల వ్యవధిలోనే ఆ మహిళ కూడా బావగారి ఇంటికి వచ్చింది. అక్కడ కూడా అవకాశం చిక్కినప్పుడల్లా పిల్లోడిని లైంగికంగా వేధించేది. ఈ క్రమంలో  ఆమె దుశ్చర్య బాలుడి తల్లి కంటపడింది. ఆ దృశ్యాలు చూసి షాక్ తిన్న తల్లి.. కొడుకును దగ్గరుకు తీసకోగా, అతను జరిగిందంతా చెప్పేశాడు. ఆలస్యం చేయకుండా..

Jagga Reddy: జగ్గారెడ్డి విషయంలో రేవంత్ చెప్పిందే నిజమైందా? -రాహుల్ ముందు నోరెత్తని రెబల్ నేత!


భర్తకు విషయం చెప్పి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలుడి తల్లి. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితురాలిని ఆదివారం నాడు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆమె నేరాన్ని ఒప్పుకోక తప్పలేదు. ఎయిడ్స్ వ్యాదితో తన కుటుంబం ఆరిపోతుంటే, బావగారి కుటుంబం మాత్రం పచ్చగా ఉండటాన్ని చూసి ఆమె ఓర్చుకోలేకపోయింది. అదీగాక తనకు పిల్లలు కలగలేదనే కోపం కూడా ఉండేది. ఆ దుగ్ధతోనే భర్త సోదరుడి ఇల్లు కూడా నాశనం కావాలని ఆమె కోరుకుంది. వారసుడైన కొడుక్కి హెచ్ఐవీ అంటిస్తే పీడాపోతుందని భావించి ఉద్దేశపూర్వకంగానే బాలుడిపై లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పిల్లాడిని వైద్య పరీక్షలకు తరలించిన పోలీసులు.. నింతురాలిని రిమాండ్ కు తరలించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Aids, Crime news, HIV, Married women, School boy, Uttarakhand

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు