హెచ్‌ఐవీ బాధితురాలిపై నలుగురి గ్యాంగ్ రేప్.. మహారాష్ట్రలో దారుణం..

Crime News: ఓ స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు వెళ్లగా.. అక్కడ నలుగురు వ్యక్తులు ఆమెపై విరుచుకుపడ్డారు. ఏ మాత్రం కనికరం లేకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

news18-telugu
Updated: August 1, 2019, 4:03 PM IST
హెచ్‌ఐవీ బాధితురాలిపై నలుగురి గ్యాంగ్ రేప్.. మహారాష్ట్రలో దారుణం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ హెచ్‌ఐవీ బాధితురాలిపై నలుగురు కామాంధులు ఆత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు (19) ఔరంగాబాద్‌లో తన సోదరుడితో కలిసి నివసిస్తోంది. అయితే, స్థానికంగా ఉన్న ఓ స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు వెళ్లగా.. అక్కడ నలుగురు వ్యక్తులు ఆమెపై విరుచుకుపడ్డారు. ఏ మాత్రం కనికరం లేకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి చర్యలతో తీవ్ర గాయాల పాలైంది. ఘటనతో భయపడ్డ ఆమె సోదరుడు.. ఆమెను తండ్రి చెంతకు పంపించేశాడు. బాధితురాలి తండ్రి స్థానిక బేగంపురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె సామూహిక అత్యాచారానికి గురైందని గుర్తించారు.

నిందితుల వివరాలు తెలిస్తే చెప్పాలని పోలీసులు బాధితురాలిని కోరగా.. ఆ కామాంధుల చర్యతో తీవ్రంగా గాయపడ్డానని, ఆ సమయంలో వారిని గుర్తు పట్టే స్థితిలో లేనని వెల్లడించింది. అయితే, నిందితులు ముంబైకి చెందిన వారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో కేసును బేగంపురా పోలీస్ స్టేషన్ నుంచి ముంబైలోని ఛునాభట్టి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

First published: August 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>