అమెరికాలో ఒక వ్యక్తి తనకు ఎయిడ్స్ ఉందని తెలిసినా ఆ విషయం చెప్పకుండా చాలా మంది మహిళలతో సెక్స్ చేసిన ఒక వ్యక్తికి కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. మహిళలకు అసలు విషయం చెప్పకుండా దాచినందుకు గానూ కోర్టు ఈ శిక్ష విధించింది. ఈ మేరకు యూఎస్ లోని డేవిడ్సన్ కౌంటీ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి స్టీవ్ డోజియర్ ఆయనకు శిక్ష ఖరారు చేశారు.
వివరాల్లోకెళ్తే.. అమెరికాలోని నాష్వెల్లీకి చెందిన డాని ఫెర్రీ సాఫ్ట్ బాల్ క్రీడాకారుడు. ఆయనకు 41 ఏళ్లు. చాలా రోజుల క్రితమే ఆయనకు ఎయిడ్స్ నిర్ధారణ అయింది. కానీ ఆ విషయం బయటకు వెల్లడించకుండానే సుమారు 20 మంది మహిళలతో కండోమ్ వాడకుండానే సెక్స్ లో పాల్గొన్నాడు. క్రీడాకారులే కాకుండా హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు కూడా బాధితులుగా ఉన్నారు. ఫెర్రీపై కేసు పెట్టిందే గాక ఈ కేసులో ఆమెకు శిక్ష పడేలా చేసింది కూడా ఆయన బాధితురాలే కావడం గమనార్హం.
2009 లోనే అతడికి ఎయిడ్స్ వచ్చినట్టు బాధితురాల్లలో ఒకరు తెలిపారు. తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టుల ఆధారంగా.. ఆయనపై కేసు నమోదుచేశారు. 2016లో ఆయన దగ్గర కోచింగ్ కు వచ్చిన ఒక యువతితో ఫెర్రీ సెక్స్ లో పాల్గొనగా.. ఆమెకు హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె అతడిని పిలిచి అడగ్గా.. ఫెర్రీ దానికి ఒప్పుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె అతడి గురించి ఆరా తీసింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పలువురితో చాట్ చేసేప్పుడు ఎయిడ్స్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులు.. ఇతర అంశాలు అందులో కనిపించాయి. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, ఈ ఏడాది గతనెలలో జరిగిన పోలీసుల విచారణలో ఫెర్రీ నేరాన్ని అంగీకరించాడు. తనకు ఎయిడ్స్ ఉన్న విషయం నిజమేననీ, అయినా అది చెప్పకుండానే చాలా మంది మహిళలతో సెక్స్ చేసినట్టు ఒప్పుకున్నాడు. అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లో చాలా మంది మహిళలతో సెక్స్ చేశానని అంగీకరించాడు. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంటున్న ఫెర్రీ బాధితుల్లో ఒకరైన మహిళ అమెరికాలో ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఆమె.. ది నేకెడ్ ట్రూత్ అనే పుస్తకాన్ని కూడా రచించింది. ఫెర్రీకి ఆరేళ్లు శిక్ష పడటంపై ఆమె స్పందిస్తూ.. ఈ రోజు నా జీవితంలో మరించిపోలేని రోజని చెప్పింది. అతడిని వదలొద్దని ఫేస్బుక్ లో ఉద్వేగభరిత పోస్టు చేసింది.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.