హోమ్ /వార్తలు /క్రైమ్ /

వామ్మో.. మహిళలతో శారీరక సంబంధాలు.. హెచ్ఐవీ స్ప్రెడ్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు..

వామ్మో.. మహిళలతో శారీరక సంబంధాలు.. హెచ్ఐవీ స్ప్రెడ్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karnataka: వారంతా యువకులు. అనేక మంది మహిళలతో శారీరక సంబంధాలను పెట్టుకున్నారు. అయితే, వారికి హెచ్ఐవీ కూడా సోకింది.

కొందరు యువకులు యంగ్ ఏజ్ లో తప్పటడుగులు వేస్తున్నారు. సినిమాల ప్రభావం, పాశ్చాత్య ధోరణుల పాటిస్తు చిన్న వయసులోనే చెడు అలవాట్లకు బానిసవుతున్నారు. కొందరు పిల్లలు, ఇంట్లో తెలవకుండా సిగరెట్లు, మందు కూడా తాగుతున్నారు. మరికొందరు మత్తుపదార్థాలు తీసుకుంటున్నారు. పోర్న్ వీడియోలకు బానిసవుతున్నారు. ఈ క్రమంలో అశ్లీల వీడియోలు చూస్తున్నారు. మరికొందరు వేశ్యల దగ్గరకు కూడా వెళ్తున్నారు. దీంతో చిన్న తనం లోనే వారికి తెలవకుండానే భయంకర వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటికి బడా బాబులు, పిల్లలు పబ్ లకు వెళ్తు అత్యాచారాలు చేస్తున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. అయితే, తాజాగా, బెంగళూరు పోలీసులు కొందరు మధ్య వయసు యువకులను అరెస్టు చేశారు. వీరిని విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చాయి.

పూర్తి వివరాలు.. కర్ణాటకలో (Karnataka) పోలీసులను చైన్ స్నాచర్ లు కొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో వారు.. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బెంగళూరులో పోలీసులు ముగ్గురు చైన్ స్నాచర్ లను పట్టుకున్నారు. వీరంతా 20 నుంచి 30 ఏళ్ల మధ్యన వయసు వారే. వీరిని అదుపులోనికి తీసుకుని పోలీసులు విచారించారు. వీరు ఇప్పటి వరకు 90 మంది వరకు వేశ్యలతో శారీరంగా కలిసినట్లు (Prostitution house) తెలిపారు. నిందితులకు సూపర్-స్ప్రెడర్ (HIV AIDS Gang) ముఠాగా.. హెచ్ఐవీ సొకినప్పటికి.. వీరికి తెలియకుండానే అనేక మంది మహిళలతో శారీరకంగా కలిసినట్లు తెలుస్తోంది.

పోలీసులు వీరి వద్దనుంచి 140 గ్రాముల బంగారం, రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. వీరు చైన్ స్నాచింగ్ లకు ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకునే వారని తెలిసింది. మే 26న జయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్య అనే మహిళ నుంచి వీరు.. బంగారు గొలుసు లాక్కెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. నిందితులంతా.. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో కొంతకాలం క్రితం యువకులు కలుసుకున్నారు.

అక్కడ వారు ముఠాగా ఏర్పడాలనే ఆలోచనతో బయటికొచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముఠాగా కలిసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. వారు బంగారు గొలుసులను విక్రయించారు. మొత్తం డబ్బును సెక్స్ వర్కర్లతో ఎంజాయ్ చేస్తు.. ఇతర విలాసాలకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Karnataka, Prostitution racket

ఉత్తమ కథలు