విశాఖలో బట్టబయలైన సెక్స్ రాకెట్.. హోటల్‌లో పట్టుబడ్డ యువతులు..

నిర్వాహకుల గురించి ఆరా తీయగా.. రిషి అనే వ్యక్తి పేరు బయటపెట్టారు. రిషి ఫోన్‌లోనే తమను కాంటాక్ట్ చేస్తాడని.. ఎవరిని ఎక్కడ కలవాలో చెబుతారని తెలిపారు.

news18-telugu
Updated: August 28, 2019, 11:05 AM IST
విశాఖలో బట్టబయలైన సెక్స్ రాకెట్.. హోటల్‌లో పట్టుబడ్డ యువతులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖపట్నంలో ఓ హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. స్టార్ హోటల్సే అడ్డాగా వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుల గురించి ఆరా తీయగా.. వాళ్లు ఫోన్‌లోనే అన్ని వివరాలు చెబుతారని, డైరెక్ట్‌గా కలవరని పేర్కొనడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళ్తే.. ముంబై,బెంగళూరులకు చెందిన ఇద్దరు యువతులు ఇటీవల విశాఖలోని ఓ స్టార్ హోటల్లో దిగారు. రిషి అనే వ్యక్తి అక్కడికి విటులను పంపించడంతో.. వారితో వ్యభిచారం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌పై దాడి చేసి యువతులను పట్టుకున్నారు. అప్పటికే విటులు పారిపోయారు. నిర్వాహకుల గురించి ఆరా తీయగా.. రిషి అనే వ్యక్తి పేరు బయటపెట్టారు. రిషి ఫోన్‌లోనే తమను కాంటాక్ట్ చేస్తాడని.. ఎవరిని ఎక్కడ కలవాలో చెబుతారని తెలిపారు. అతను చెప్పిన ప్రకారమే విశాఖలోని హోటల్‌కు వచ్చామని చెప్పారు. యువతులను పోలీసులు స్టేట్ షెల్టర్ హోమ్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Published by: Srinivas Mittapalli
First published: August 28, 2019, 11:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading