పెళ్లి శుభలేఖలో తన పేరు లేదని, భార్య హత్య.. కుమార్తెపై హత్యాయత్నం

పెళ్లి శుభలేఖలో తండ్రిగా తన పేరు ఎందుకు వేయలేదని భార్యను ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తండ్రిగా బాధ్యతలు తీసుకోని వ్యక్తికి తానెందుకు మర్యాద ఇవ్వాలని ఆమె కూడా గట్టిగా నిలదీసింది.

news18-telugu
Updated: April 28, 2019, 8:21 PM IST
పెళ్లి శుభలేఖలో తన పేరు లేదని, భార్య హత్య.. కుమార్తెపై హత్యాయత్నం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 28, 2019, 8:21 PM IST
కుమార్తె పెళ్లి శుభలేఖలో తన పేరు ప్రచురించనందుకు ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. కుమార్తె మీద హత్యాయత్నం చేశాడు. మహారాష్ట్రలోని తాంకరపాదలో ఈ ఘటన జరిగింది. 52 ఏళ్ల ఆటో డ్రైవర్ రెండేళ్ల క్రితం తన భార్య, 24 ఏళ్ల కుమార్తెను వదిలేసి వేరే ఇంటికి వెళ్లిపోయాడు. భార్యాబిడ్డల బాగోగులు కూడా చూసుకోవడం లేదు. అయితే, వయసొచ్చిన కుమార్తెకు పెళ్లి చేయాలని తలంచిన ఆ తల్లి.. ఓ సంబంధం చూసింది. కుమార్తెకు పెళ్లి ఖాయంచేసింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఆటో డ్రైవర్ ఆ తల్లీబిడ్డలు ఉంటున్న ఇంటికి వచ్చాడు. పెళ్లి శుభలేఖలో తండ్రిగా తన పేరు ఎందుకు వేయలేదని భార్యను ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తండ్రిగా బాధ్యతలు తీసుకోని వ్యక్తికి తానెందుకు మర్యాద ఇవ్వాలని ఆమె కూడా గట్టిగా నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆటోడ్రైవర్ ఇంట్లో కిచెన్‌లోకి వెళ్లి పదునైన కత్తిని తీసుకొచ్చాడు. దాంతో భార్యపై దాడి చేశాడు. అమ్మానాన్నల మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించిన కాబోయే పెళ్లికూతురికి కూడా గాయాలయ్యాయి. భార్యను కత్తితో పొడిచిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇరుగుపొరుగు వారు బాధితులను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే తల్లి చనిపోయింది. కుమార్తెకు చికిత్స అందిస్తున్నారు.

First published: April 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...