Fire to House of Muslim Man : ఉత్తరప్రదేశ్ లో వేరువేరు మతాలకు చెందిన ఓ జంట పారిపోయ పెండ్లి చేసుకోవడం స్థానికంగా ఉద్రిక్తలకు కారణమైంది. హిందు కుటుంబానికి చెందిన ఆ యువతిని ముస్లిం వర్గానికి చెందిన యువకుడు(Muslim Man) కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ రైట్ వింగ్ గ్రూపులు ఆందోళనకు దిగాయి. స్థానికంగా దుకాణాలు, అన్ని రకాల షాపులు మూసివేసి నిరసనకు దిగాయి. ఈ క్రమంలో హిందూ సంఘం సభ్యులు ముస్లిం యువకుడి ఇంటికి నిప్పుపెట్టారు. ఉత్తరప్రదేశ్(UttarPradesh)లోని ఆగ్రాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఆగ్రా(Agra)లోని రునక్తా ప్రాంతంలో నివాసముంటున్న జిమ్ ఓనర్ సాజిద్, 22 ఏళ్ల హిందూ యువతి మధ్య ప్రేమ వ్యవహారం(Love) ఉంది. ఈ నెల 11న వారిద్దరూ తమ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. దీంతో తమ కుమార్తెను సాజిద్ కిడ్నాప్ చేసినట్లు యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రైట్ వింగ్ గ్రూప్ ధర్మ్ జాగరణ్ సమన్వయ్ సంఘ్ కు చెందిన సభ్యులు శుక్రవారం ఆగ్రాలోని రుంకుట ప్రాంతంలో సాజిద్ ఇంటితోపాటు పక్కనే ఉన్న అతడి కుటుంబానికి చెందిన మరో ఇంటికి నిప్పుపెట్టారు. అంతేగాక స్థానికంగా షాపులను కూడా బలవంతంగా మూయించారు.
ఈ ఘటనపై ఆగ్రా సీనియర్ ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ పోస్ట్ ఇంచార్జ్‌ను సస్పెండ్ చేశారు. సాజిద్ ఇంటికి నిప్పుపెట్టిన హిందూ సంఘం సభ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఏనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఏఫ్ఐఆర్ నమోదుచేశారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సికంద్రా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ పాత్రపై దర్యాప్తునకు ఆదేశించారు ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్. పరిస్థితి అదుపులో ఉందని. ఆ ప్రాంతంలో పోలీసు బలగాలను మోహరించినట్లు ఎస్పీ తెలిపారు. ,ఈ మతాంతర జంట ఇష్టపూర్వకంగానే పారిపోయారని, ఏప్రిల్ 12న ఢిల్లీలోని ఆర్యసమాజ్ లో పెండ్లి కూడా చేసుకున్నారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
ALSO READ Kim Jong Un : అమ్మ దొంగా..సైలెంట్ గా వేల కోట్లు కొల్లగొడుతున్న కిమ్!
రెండు రోజుల కిందట హిందూ యువతి(Hindu Woman) వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. తాను మేజర్ అని, ఇష్ట పూర్వకంగానే ముస్లిం వ్యక్తితో కలిసి వెళ్లినట్లు..దయచేసి మా వల్ల మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకండి.. నేను వచ్చి కోర్టు ముందు నా వాంగ్మూలాన్ని నమోదు చేస్తాను అని అందులో పేర్కొంది. కాగా, ఆ యువతి ఉన్న ప్లేస్‌ను గుర్తించామని, ఆమెను తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. అయితే సాజిద్ ఆచూకీ ఇంకా తెలియలేదని చెప్పారు. వారిద్దరూ మేజర్లని, ప్రేమించుకుంటున్నారని పోలీస్ అధికారి వెల్లడించారు. ఇక పెళ్లికి ముందు ఆ ముస్లిం యువకుడు హిందూ మతంలోకి మారాడు. అతను దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం..ఎటువంటి బలవంతం లేదా అనవసరమైన ప్రభావం లేకుండా తన స్వేచ్ఛా సంకల్పంతో మారుతున్నట్టు చెప్పాడు. ఏప్రిల్ 12 నుండి కొత్త పేరు సాహిల్ అనే కొత్త పేరుతో పిలవబడతాడని ఆ అఫిడవిట్ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIRE, Lovers, Uttar pradesh