Home /News /crime /

HINDU TEMPLE VANDALISED IN PAKISTAN PVN

Temple Vandalised : హిందూ దేవాలయంపై పాక్ దుండగుల దాడి..విగ్రహాలు ధ్వంసం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Temple Vandalised : పాకిస్తాన్​(Pakistan)లో మరో హిందూ దేవాలయం(Hindu Temple)దుండగుల దాడికి గురైంది. ఓ హిందూ దేవాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి.. ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. క‌రాచీలోని కోరాంగి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

ఇంకా చదవండి ...
Temple Vandalised : పాకిస్తాన్​(Pakistan)లో మరో హిందూ దేవాలయం(Hindu Temple)దుండగుల దాడికి గురైంది. ఓ హిందూ దేవాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి.. ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. క‌రాచీలోని కోరాంగి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఘటనాస్థలం సమీపంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. సంజీవ్​ అనే స్థానికుడు తెలిపిన ప్రకారం.."సుమారు 8 మంది బైక్‌ల‌పై వ‌చ్చిన కొందరు వ్యక్తులు క‌రాచీలోని కోరాంగి ప్రాంతంలో ఉన్న శ్రీ మారి మాతా మందిరంలోకి ప్ర‌వేశించి విగ్ర‌హాల‌ను ధ్వంసం చేశారు. ఆలయంపై దాడి చేసిన వ్యక్తులు ఎవరో తెలియదు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని సమీక్షించారు"అని సంజీవ్ తెలిపారు. ఆల‌య ధ్వంసం ఘ‌ట‌న‌తో స్థానిక హిందువుల్లో భ‌యాందోళ‌న‌లు చెలరేగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఘటనాస్థలం సమీపంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఆరుగురు దుండగులు ఆలయంపై దాడి చేశారని.. పరారీలో ఉన్న వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

అయితే పాకిస్తాన్ లో హిందూ ఆలయాలపై దాడి(Hindu Temples Attck In Pakistan)జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆలయాలు దుండగుల దాడులకు గురయ్యాయి. ఇండ‌స్ న‌ది స‌మీపంలో ఉన్న ఓ చ‌రిత్రాత్మ‌క ఆల‌యాన్ని కూడా ఇటీవ‌ల ధ్వంసం చేశారు దుండగులు. గతేడాది ఆగస్టులో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఓ దేవాలయంపై కొందరు దాడి చేసి, విగ్రహాలు ధ్వంసం చేశారు. గతేడాది అక్టోబరులో కోట్రీ ప్రాంతంలోని ఓ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేశారు దుండగులు.

రూ.50వేలు కడితేనే కొడుకు మృతదేహాన్ని ఇస్తామన్న హాస్పిటల్.. భిక్షాటన చేస్తున్న తల్లిదండ్రులు!

Shocking: బాలికపై అత్యాచారం..నిందితులను కొట్టి పెట్రోల్ పోసి తగులబెట్టిన గ్రామస్తులు..ఒకరు మృతి



మరోవైపు,పాకిస్థాన్ లో (Pakistan) కొన్ని నెలలుగా రాజకీయ సంక్షోభంతో, ఆర్థిక వ్యవస్థ (Economic crisis) కూడా దిగజారుతుంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నూతన ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. తన మంత్రులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో..ప్రధానంగా దేశం ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు పలు కొత్త విధానాలను పాటించాలని నిర్ణయించారు. దీనిలో ప్రధానంగా.. విద్యుత్ వినియోగం తగ్గించాలని నిర్ణయించారు. ఇందు కోసం రాత్రి 10 తర్వాత వివాహ వేడుకలు జరుపుకోవడానికి అనుమతి నిరాకరించారు. అదే విధంగా, మార్కెట్ లను రాత్రి 8.30 గంటలకు మూసివేయాలని వ్యాపారులకు ఆదేశించారు. దీంతో విద్యుత్ వినియోగం తగ్గి , విద్యుత్ సంక్షోభం గాడిలో (Electricity crisis) పడుతుందని భావిస్తున్నారు. అదే విధంగా, పాక్ లో ప్రస్తుతం.. ఉత్పత్తి అవుతున్న విద్యుత్ 22,000 మెగావాట్లు కాగా, 26,000 మెగావాట్ల అవసరం ఉందని, దేశంలో దాదాపు 4,000 మెగావాట్ల విద్యుత్ కొరత విద్యుత్ శాఖ మంత్రి ఖుర్రుమ్ దస్తగిర్ తెలిపారు. ఇక మీదట కూడా గతంలో మాదిరిగానే క్యాబినేట్ ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం కూడా సెలవు దినాలను పునరుద్ధరించాయి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Hindu Temples, Pakistan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు