పాక్‌లో హిందూ దేవాలయం ధ్వంసం... శ్రీకృష్ణుడి విగ్రహాలకు నిప్పు...

హిందూ ఆలయంపై జరిగిన దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. ఇలాంటి చర్యలు ఖురాన్‌కు వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సింధ్ ప్రావిన్స్ అధికారులను ఆదేశించారు.

news18-telugu
Updated: February 7, 2019, 5:48 AM IST
పాక్‌లో హిందూ దేవాలయం ధ్వంసం... శ్రీకృష్ణుడి విగ్రహాలకు నిప్పు...
హిందూ ఆలయంపై జరిగిన దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. ఇలాంటి చర్యలు ఖురాన్‌కు వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సింధ్ ప్రావిన్స్ అధికారులను ఆదేశించారు.
news18-telugu
Updated: February 7, 2019, 5:48 AM IST
పాకిస్తాన్‌లో అల్లరిమూకలు బీభత్సం సృష్టించాయి. సింధ్ ప్రావిన్స్‌లో హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. ఖైర్‌పూర్‌ జిల్లా కుంబ్‌లోని శ్యామ్‌సేవా దేవాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆలయంలోకి వెళ్లి కృష్ణుడు, ఇతర విగ్రహాలకు నిప్పుపెట్టారు. గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ విధ్వంసాన్ని నిరసిస్తూ సింధ్ ప్రావిన్స్‌లో పలు హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి.

ఘటనపై ఖైర్‌పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఐతే ఘటన జరిగి ఐదారు రోజులవుతున్నా ఇప్పటికీ నిందితులను పట్టుకోక పోవడంపై హిందూసంఘాలు మండిపడుతున్నాయి. హిందూ ఆలయంపై జరిగిన దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. ఇలాంటి చర్యలు ఖురాన్‌కు వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సింధ్ ప్రావిన్స్ అధికారులను ఆదేశించారు.కాగా, పాకిస్తాన్ మొత్తం జనాభా (22 కోట్లు)లో 2శాతం మంది హిందువులు ఉన్నారు. పాకిస్తాన్‌లోని హిందువుల్లో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లోనే నివసిస్తున్నారు. అల్పసంఖ్యాక హిందువులపై అతివాదులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ తరచూ పోలీసులకు ఫిర్యాదు అందుతుంటాయి.
First published: February 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...