ఢిల్లీ శ్రద్దావాకర్(Shraddawakar)మర్డర్ కేసులో హంతకుడిపై దాడికి యత్నించారు కొందరు వ్యక్తులు. ప్రియురాలిని 35ముక్కలు చేసిన ప్రేమోన్మాదిని వదిలిపెట్టమంటూ హిందూసేన కార్యకర్తలు(Hindu sena activists)దేశ రాజధానిలో పోలీసుల ముందే హెచ్చరించారు. నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా(Aftab Poonawala)కు పాలిగ్రాఫ్ టెస్ట్(Polygraph Test)కోసం ఫోరెన్సిక్ ల్యాబ్(Forensic Lab)కు తరలించారు పోలీసులు. అదే సమయంలో అక్కడికి వచ్చిన హిందూసేనా కార్యకర్తలు కత్తులు, తల్వార్లు పట్టుకొని పోలీస్ వ్యాన్(Police van)లో ఉన్న ఆఫ్తాబ్ పూనావాలపై దాడికి ప్రయత్నించారు. తమ సోదరిని చంపిన దుర్మార్గుడ్ని మాకు అప్పగించమని నినాదాలు చేశారు. నమ్మిన యువతిని 35ముక్కలు చేసిన వాడ్ని 70ముక్కలుగా నరికివేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్తాబ్‌ని తరలిస్తున్న పోలీస్ వెహికల్ వెనుక తల్వార్లు పట్టుకొని పరుగులపెట్టారు.
శ్రద్దవాకర్ని చంపిన వాడిపై దాడికి యత్నం..
ఢిల్లీలో తనతో లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకున్న యువతిని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఆఫ్తాబ్ పునావాలను వదిలిపెట్టమంటున్నారు హిందూ సేన కార్యకర్తలు. ఢిల్లీలో సోమవారం పాలిగ్రాఫీ టెస్ట్ కోసం నిందితుడ్ని పోలీస్ వ్యానులో రోహిణిలోని ఫోరెన్సిక్ కార్యాలయానికి తీసుకొచ్చిన సమయంలో అక్కడున్న హిందూ సేనా కార్యకర్తలు తల్వార్లు తీసుకొని వాహనంలో ఉన్న ఆఫ్తాబ్పై దాడికి ప్రయత్నించారు. మీడియా పోలీసులు అడ్డుకుంటున్న వినిపించుకోకుండా అలజడి సృష్టించారు.
ఆఫ్తాబ్‌ని వదిలిపెట్టమని వార్నింగ్..
తమ సోదరి లాంటి అమ్మాయిని అన్యాయంగా చంపిన వాడ్ని వదిలిపెట్టమంటున్నారు హిందూ సేనా సభ్యులు. నేరస్తుడు ఆఫ్తాబ్‌ని తమకు అప్పగిస్తే ముక్కులు ముక్కలు చేస్తామని ..శ్రద్దావాకర్పైనే కాదు భారతదేశంలో ఏ ఆడపిల్లపైన ఇలాంటి దాడులు చేసిన వాళ్లను విడిచిపెట్టమని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశంలో అక్క,చెల్లెళ్లతో సమానమైన ఆడవాళ్లను చంపుతుంటే మేం బ్రతికి ఏం లాభమంటూ నిందితుడ్ని బూతులు తిడుతూ తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఢిల్లీ పోలీసులు గాల్లో కాల్పులు జరిపడంతో హిందుసేనా సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో నిందితుడ్ని పోలీసులు జైలుకు తరలించారు.
ప్రేమోన్మాదికి మరణశిక్షేనా..
పాతికేళ్ల యువతి శ్రద్ధా వాకర్‌ను డేటింగ్ యాప్‌తో పరిచయం చేసుకున్న 27ఏళ్ల ఆఫ్తాబ్ ఆమెతో సహజీవనం చేస్తూ అనుమానించాడు. పెళ్లి చేసుకోమని కోరుతోందని ఆమెపై కోపంతో చంపి35 ముక్కలుగా నరికి మూడు వారాల పాటు ఇంట్లో 300 లీటర్ల ఫ్రిజ్‌లో ఉంచాడు. మే18న జరిగిన ఈ హత్య కేసులో నిందితుడ్ని నవంబర్ 12న పోలీసులు అరెస్టు చేశారు. అతడ్ని విచారించిన పోలీసు చాలా నిజాల్ని రాబట్టారు. మరికొందరు అమ్మాయిలతో కూడా ఆఫ్తాబ్కి పరిచయాలు ఉన్నట్లుగా తేలడంతో వాళ్లను కూడా విచారించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Delhi, National News