హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad: హైదరాబాద్‌లో హిజ్రాల హల్‌చల్.. వ్రతం జరుగుతున్న ఇంట్లోకి ప్రవేశించి..

Hyderabad: హైదరాబాద్‌లో హిజ్రాల హల్‌చల్.. వ్రతం జరుగుతున్న ఇంట్లోకి ప్రవేశించి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌లో కొందరు హిజ్రాలు హల్‌చల్‌ చేశారు. నగరంలోని బాచుపల్లి ప్రగతి నగర్‌లో ఓ ఇంట్లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించారు.

  హైదరాబాద్‌లో కొందరు హిజ్రాలు హల్‌చల్‌ చేశారు. నగరంలోని బాచుపల్లి ప్రగతి నగర్‌లో ఓ ఇంట్లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతేకాకుండా బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. వివరాలు.. ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్న ఓ ప్రైవేటు ఉద్యోగి గురువారం తన కుమారుడి పెళ్లి చేశాడు. శుక్రవారం ఇంట్లో సత్యనారాయణ స్వామి వత్రం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వత్రం జరుగుతున్న రోజు 10 మంది హిజ్రాలు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. రూ. 20వేలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. అందుకు ఆ ఇంటి యజమాని నిరాకరించాడు. ఎంతో కొంత తీసుకుని వెళ్లాల్సిందిగా కోరాడు. అయితే అందుకు హిజ్రాలు అంగీకరించలేదు. తాము అడిగిన మొత్తం ఇవ్వాలంటూ బెదిరించారు. ఈ క్రమంలోనే హిజ్రాలు అసభ్యకర రీతిలో అక్కడే అర్ధనగ్న ప్రదర్శన చేశారు. దీంతో భయపడిన బాధిత కుటుంబం.. వారికి 16,500 రూపాయలు ముట్టజెప్పింది. ఆ డబ్బులు తీసుకుని హిజ్రాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  ఇంట్లో వ్రతం చేసుకుంటున్న సమయంలో హిజ్రాలు ప్రవర్తించిన తీరు బాధిత కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. దీంతో ఈ ఘటనకు సంబంధించి వారు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తం 10 మంది హిజ్రాలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7 సెల్‌ఫోన్లు, రూ. 16,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

  ఇక, ఇటువంటి చర్యలకు పాల్పడే హిజ్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఎవరికైనా ఇటువంటి ఇబ్బందులు కలిగితే డయల్ 100‌కు ఫోన్ చేయాలని కోరారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Hyderabad, Transgender