Hyderabad: అమ్మాయి మోజులో పడి నన్ను వదిలేశాడు.. పెళ్లి పేరుతో వాడుకున్నాడంటూ ఓ కుర్రాడిపై హిజ్రా ఫిర్యాదు

ప్రతీకాత్మక చిత్రం

అతడిని ఏడాదిన్నర నుంచి పోషిస్తున్నా. అడిగినప్పుడల్లా వేలకు వేలు డబ్బులు ఇచ్చా. ఇప్పుడు నన్ను మోసం చేశాడు. వేరే అమ్మాయి మోజులో పడి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు.. అంటూ ఓ హిజ్రా వాపోతోంది.

  • Share this:
    ‘నన్ను అతడు మోసం చేశాడు. నాతో కలిసి తిరిగాడు. నా డబ్బులను వాడుకున్నాడు. జల్సాలు చేశాడు. ఇప్పుడు ఓ అమ్మాయి మోజులో పడి నన్ను పట్టించుకోవడం లేదు. నా నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఇదేంటని నేరుగా నిలదీస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నాకు న్యాయం చేయండి‘ అంటూ ఓ హిజ్రా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తనను అన్ని విధాలుగా వాడుకుని వదిలేసిన యువకుడిపై చర్యలు తీసుకోండంటూ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని మల్లాపూర్ నెహ్రూనగర్ కు చెందిన దివ్య అనే హిజ్రాకు మెహిదీపట్నంలోని మ్లలేపల్లికి చెందిన నాగేందర్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. నాగేందర్ కు జాతరలు చూసే అలవాటు ఎక్కువ.

    ఈ క్రమంలోనే మూడేళ్ల క్రితం దివ్య అతడికి పరిచయం అయింది. పలుమార్లు కలవడంతో ఆమె ఫోన్ నెంబర్ ను తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో స్నేహం చేశాడు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారిందని చెప్పేవాడు. ఆమెతో కలిసి మద్యం తాగుతూ జల్సాలు చేశాడు. నాగేందర్ అంటే ఇష్టంతో అతడు ఎప్పుడు అడిగినా దివ్య డబ్బులు ఇచ్చేది. కుటుంబాన్ని వదిలేసి మరీ నాగేందర్ దివ్యతోనే ఆమె గదిలోనే ఉండేవాడు. 2019వ సంవత్సరం నవంబర్ నెలలో నాగేందర్ కు దివ్యకు పెళ్లి జరిగింది. దీంతో వారిధ్దరూ కలిసి ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులను చూడాలని ఉందని ఇంటికి వెళ్లి వచ్చేవాడు.
    ఇది కూడా చదవండి: స్నేహితురాలిని తీసుకుని బైక్‌పై అటవీ ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లిన కుర్రాడికి చేదు అనుభవం.. వాళ్లిద్దరూ ఒంటరిగా ఉన్న సమయంలో..

    ‘అతడు ఏ పని చేసేవాడు కాదు. నేనే అతడిని ఏడాదిన్నర నుంచి పోషిస్తున్నా. అడిగినప్పుడల్లా వేలకు వేలు డబ్బులు ఇచ్చా. ఇప్పుడు నన్ను మోసం చేశాడు. అతడికి ఈ మధ్యనే వేరే అమ్మాయి పరిచయం అయింది. అందుకే నన్ను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. నిలదీస్తే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ అమ్మాయితో కలిసి ఉంటున్నాడు. ఆ అమ్మాయి మోజులో పడి నాకు అన్యాయం చేస్తున్నాడు’ అంటూ దివ్య కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు.
    ఇది కూడా చదవండి: గర్భవతి అయినప్పటికీ భర్తతో శృంగారంలో పాల్గొన్న భార్య.. కడుపులో బిడ్డ ఎదుగుదలను చూసేందుకు స్కానింగ్ తీస్తే షాకింగ్ రిజల్ట్
    Published by:Hasaan Kandula
    First published: