సిరిసిల్లలో రెచ్చిపోయిన హిజ్రా.. యువకుడిని చితక బాదుకుంటూ.. ఈడ్చుకుంటూ వెళ్లి దారుణం

ప్రతీకాత్మక చిత్రం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పాత బస్టాండ్ లో హిజ్రాలు రెచ్చిపోయారు. ఓ యవకుడి పై తీవ్రంగా దాడి చేయడంతో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పాత బస్టాండ్ లో హిజ్రాలు రెచ్చిపోయారు. ఓ యవకుడి పై తీవ్రంగా దాడి చేయడంతో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వివరాల ప్రకారం.. గత కొద్ది నెలలుగా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన హిజ్రాలు పట్టణంలో వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో డబ్బులు అడుక్కుంటూ జీవిస్తున్నారు. అయితే.. నిన్న రాత్రి పాత బస్టాండ్ లో నిద్రిస్తున్న ఓ హిజ్రా తన జేబులో నుంచి ఓ యువకుడు పోన్ దొంగిలిస్తుండగా దొరకబట్టానని, తన జేబులో ఉండాల్సిన ఎనిమిది వేల రూపాయల నగదు మాయమయ్యాయని, వాటిని ఆ యువకుడే దొంగిలించాడని ఆరోపించారు. ఇలా ఆరోపిస్తూ ఆ యువకుడిని ఇష్టారీతిన చితకబాదాడు.

  బస్టాండ్ ఆవరణలోని మెట్లపై నుండి ఈడ్చుకుంటూ వెళ్లాడు. బూటుకాలుతో విచక్షణా రహితంగా తన్నుతూ.. కట్టెతో బాదుతూ నానా భీభత్సం సృష్టించాడు. దీనితో ఆ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన కొంతమంది ప్రయాణికులు 108 కు సమాచారాన్ని అందించారు. అక్కడికి చేరుకున్న ఆ 108 సిబ్బంది ఆ యువకుడిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ సంఘటనతో ప్రయాణికులు బయబ్రాంతులకు గురయ్యారు.

  ఇదిలా ఉంటే.. బెంగళూరుకు చెందిన ఓ భార్య చిన్న కారణంతో తన భర్తను పుట్టింటివారితో చిత్కకొట్టించింది. వివరాల్లోకెళితే..కూతురు చెప్పిన మాట వినలేదని అత్తింటి వారు, ఇతరులు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. ఇంటి పనులు నిర్వర్తించలేదనే కారణంతో…మామ, అతని బావమరిదితో పాటు నలుగురు వ్యక్తులు కొట్టిన ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 09వ తేదీన కేఆర్ పురంలోని మేదహల్లిలో ఈ ఘటన జరిగింది.
  Published by:Nikhil Kumar S
  First published: