Home /News /crime /

HIGH SCHOOL INDIAN STUDENT DROWNS IN US WHILE TRYING TO RETRIEVE FOOTBALL FROM POND

America: యూఎస్ లో పెను విషాదం.. చెరువులో మునిగి భారతీయ విద్యార్థి దుర్మరణం ..

నీటిలో మునిగి చనిపోయిన విద్యార్థి

నీటిలో మునిగి చనిపోయిన విద్యార్థి

United states: న్యూజెర్సీ లో దారుణ ఘటన జరిగింది. భారత దేశానికి చెందిన యువకుడు యూఎస్ లో.. నీటిలో మునిగి పోయి చనిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

High School Indian Student Drowns in US: అమెరికాలో భారత సంతతికి చెందిన ఒక బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం ఇల్లినాయిస్ లో జరిగింది.ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కేరళ కు చెందిన క్లింటెన్ అజిత్ డిగ్రీ చదువు కోవడానికి అమెరికాలోని ఇల్లినాయిస్ కి వెళ్లాడు. కాలేజ్ అయ్యాక.. స్నేహితులతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో వారు బాల్ ను కొట్టగానే అది పక్కనే ఉన్న ఒక చెరువులోకి వెళ్లి పడింది. అయితే, అజిత్ కు ఈతరాదు. అతను నీటిలో దిగాడు.

లోతు ఎక్కువగా ఉండదని భావించాడు. అప్పుడు ఒక్కసారిగా కాలు జారీ అతను నీళ్లలో కూరుకుపోయాడు.చూస్తుండగానే చెరువులోని నీళ్లు అతని చుట్టుముట్టాయి. అతను ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కాపాడంంటూ కేకలు వేస్తున్నాడు. మిగతా విద్యార్థులు అందరు సహాయం కోసం గట్టిగా అరిచారు. కానీ అప్పటి వరకు జరగకూడని దారుణం జరిగింది. అజిత్ నీటిలో మునిగి చనిపోయాడు. వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. అతడిని బయటకు తీయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అతను అమెరికాలోని యూనివర్సీటిలో క్రిమినల్ జస్టిస్ ను అభ్యసిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సంఘటనతో కేరళలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డిగ్రీ పట్టాతో వస్తాడనుకుంటే.. విగత జీవిగా మారాడని తెలిసి ఇంట్లో వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కుటుంబ సభ్యులు పడుతున్న బాధను చూసి పలువురు కంటితడి పెట్టుకుంటున్నారు. మ్రత దేహాన్ని అతని స్వస్థలానికి పంపడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు.

విదేశాల్లో చదువుతోన్న భారతీయ విద్యార్థులకు సంబంధించి మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

అమెరికాలో ఉన్నత చదవులు అభ్యసిస్తోన్న ఇద్దరు తెలంగాణ యువకులు అనూహ్య ప్రమాదంలో చనిపోయారు. ఆ ప్రమాదంలోనే మరో ముగ్గురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబీకులు, అమెరికన్ మీడియా ద్వారా వెల్లడైన వివరాలివి..

అమెరికాలోని తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని అలెగ్జాండర్‌ కౌంటీ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. చనిపోయిన ఇద్దరు యువకుల్లో ఒకరు ఖమ్మం జిల్లా ఏన్కురు మండలం జన్నారం గ్రామానికి చెందిన స్వర్ణ పవన్‌ (23) కాగా, రెండో యువకుడు హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన పీచెట్టి వంశీకృష్ణ.

స్వర్ణపవన్‌ 2021 ఆగస్టులో ఇల్లియాస్‌ యునివర్సిటీలో ఎంఎస్‌ చదివేందుకు అమెరికా వెళ్లారు. ఈనెల 21న ఇల్లియాస్‌ యూనివర్సిటీకి కారులో తన స్నేహితులతో కలిసి వెళ్లి తిరిగి వస్తుండగా రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవింగ్‌ చేస్తున్న పవన్‌, పక్కన కూర్చున్న ఆయన స్నేహితుడు వంశీకృష్ణ అక్కడిక్కడే మృతి చెందారు. వీరితో పాటు కారులో ఉన్న స్నేహితులు యస్వంత్‌, కార్తీక్‌, కళ్యాణ్‌ కు గాయాలయ్యాయి.

కారు ప్రమాద ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి పవన్‌ మృతదేహాన్ని ఆయన సోదరికి అప్పగించారు. మృతదేహం సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు చేరుకుంటుందని, అక్కడి నుంచి జన్నారానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: America, Death, Students, United states

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు