Home /News /crime /

HIGH QUALITY CONDOMS CONTACT WITH 150 PEOPLE THENI NURSE CASE FINALLY ENDED SSR

OMG: ఈ నర్స్ ఇంట్లో 500 హై క్వాలిటీ కండోమ్స్.. అన్ని ఎందుకున్నాయో తెలిసి షాకయిన పోలీసులు

సెల్వి (ఫైల్ ఫొటో)

సెల్వి (ఫైల్ ఫొటో)

తమిళనాడులోని తేనీ జిల్లాలో ఓ నర్స్ దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తేనీ జిల్లా పప్పమ్మల్‌పురంలో జరిగిన ఈ నర్స్ హత్య వెనుక కారణాలు తెలిసి పోలీసులు విస్తుపోయారు.

    చెన్నై: తమిళనాడులోని తేనీ జిల్లాలో ఓ నర్స్ దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తేనీ జిల్లా పప్పమ్మల్‌పురంలో జరిగిన ఈ నర్స్ హత్య వెనుక కారణాలు తెలిసి పోలీసులు విస్తుపోయారు. ఆమె ఇంట్లో పరిశీలించగా 500 హై క్వాలిటీ కండోమ్స్ కనిపించాయి. పోలీసులు ఈ కేసు విచారణను సీరియస్‌గా కొనసాగించగా ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తేనీ జిల్లా అండిపట్టి సమీపంలోని పప్పమ్మల్‌పురానికి చెందిన సురేష్ దిండిగుల్‌లో క్యాటరర్‌‌గా పనిచేస్తుండేవాడు. అతని భార్య సెల్వి(43) అండిపట్టి గవర్నమెంట్ హాస్పిటల్‌లో సీనియర్ నర్సుగా పనిచేసేది. వీళ్లకు ఒక పాప, బాబు ఉన్నారు. దాదాపు 17 సంవత్సరాలుగా సెల్వి నర్సుగా పనిచేస్తోంది. సురేష్, సెల్వి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. సురేష్ దిండిగుల్‌లోనే క్యాటరర్‌గా పనిచేసుకుంటూ పిల్లలతో కలిసి అక్కడే ఉండిపోగా.. సెల్వి అండిపట్టిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటోంది.

    ఇది కూడా చదవండి: Shameful Incident: ఇదేం చండాలం.. ఇలాంటివే జరుగుతుంటే కరోనా రావడం పెద్ద వింతేమీ కాదు..

    ఈ క్రమంలో గతేడాది నవంబర్ 24న ఆమె అద్దెకు ఉంటున్న ఇంట్లో సెల్వి రక్తపుమడుగులో పడి చనిపోయింది. ఎవరో ఈ నర్సును దారుణంగా హత్య చేశారు. పోలీసులకు ఈ సమాచారం అందిన వెంటనే స్పాట్‌కు చేరుకుని పరిశీలించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆధారాల కోసం ఆమె ఇంటిని పరిశీలించగా పోలీసులకు సెల్వి ఇంట్లో 500 హై క్వాలిటీ కండోమ్స్ కనిపించాయి. అన్ని కండోమ్స్ ఆమె ఇంట్లో ఉండటం చూసి పోలీసులు షాకయ్యారు. పోలీసులు ఈ కేసు విచారణలో లోతుపాతులకు వెళ్లి చూడగా.. అవాక్కయ్యే నిజాలు తెలిశాయి. సెల్వి దాదాపు 150 మంది మగాళ్లతో వివాహేతర సంబంధాలు కొనసాగించినట్లు తెలిసింది. ఒకేసారి.. అన్ని కండోమ్స్ కూడా అందుకే తెచ్చిపెట్టుకున్నట్లు తేలింది.

    సెల్వి ఫోన్‌లో దాదాపు 300 కాంటాక్ట్ నంబర్స్‌ను గుర్తించిన పోలీసులు అందులో చాలామంది మగాళ్లతో ఆమె అఫైర్ నడిపినట్లు తేల్చారు. ఆ కాంటాక్ట్స్‌లోని 150 మంది మగాళ్లతో ఆమె ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ వారితో సెక్స్ చేసేదని విచారణలో తేలింది. ఆమెతో అఫైర్ నడిపిన వారిలో ప్రముఖులు చాలామంది ఉన్నట్లు తెలిసి పోలీసులు విస్తుపోయారు. వీరిలో.. కొందరు పోలీసులు, డాక్టర్లు, ఆటో డ్రైవర్లు కూడా ఉన్నట్లు కూడా విచారణలో తెలిసింది. ఈ క్రమంలోనే.. గతేడాది డిసెంబర్ 9న కంబం గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేసే రామచంద్రప్రభు (34) అనే వ్యక్తికి ఈ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అతనిని విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపారు. అయితే.. ఊహించని విధంగా ఆ మరుసటి రోజే.. అంటే డిసెంబర్ 10న రామచంద్ర ప్రభు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో.. అతనికి ఈ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న పోలీసుల అనుమానం మరింత బలపడింది.

    ఇది కూడా చదవండి: OMG: ఎట్టకేలకు బయటపడింది.. ఈ భార్య తెలివితేటల గురించి చెప్పడం కాదు.. చూడండి..

    తీగ లాగితే డొంక కదిలినట్టుగా.. సెల్వి, రామచంద్ర ప్రభు మధ్య ఉన్న సంబంధం గురించి ఆరా తీయగా.. అసలు నిజం అప్పుడు వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం పెరియకుళం ప్రభుత్వాసుపత్రిలో వీళ్లిద్దరూ కలిసి పనిచేశారు. ఆ సమయంలో వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నేళ్ల పాటు వీళ్లిద్దరూ అఫైర్‌ను కొనసాగించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. హత్య జరిగిన రోజున సెల్వి ఇంటికి అంటే.. గతేడాది నవంబర్ 24న రామచంద్ర ప్రభు తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఆమె ఇంట్లోనే ఉన్నాడు. అంతేకాదు.. హత్య జరిగిన రోజు సాయంత్రమే రామచంద్ర ప్రభు ఓ తాకట్టు దుకాణంలో సెల్వి గోల్డ్ చైన్‌ను తాకట్టు పెట్టాడు.

    ఇది కూడా చదవండి: Sister: వచ్చిన పెళ్లి సంబంధాలను పిన్ని కూతురు రిజెక్ట్ చేస్తోందని ఏ తమ్ముడైనా ఇలా చేస్తాడా..

    ఈ కేసు దర్యాప్తులో భాగంగా రామచంద్ర ప్రభు భార్యను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన భర్తకు, సెల్వికి మధ్య వివాహేతర సంబంధం ఉందని.. లక్షల రూపాయలను ఆమెకు అప్పుగా ఇచ్చాడని ఆమె తెలిపింది. దీంతో.. ఈ డబ్బును తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తే సెల్వి గొడవ పెట్టుకుని ఉండొచ్చని, ఇద్దరి మధ్య జరిగిన ఈ గొడవ కారణంగానే సెల్విని రామచంద్ర ప్రభు చంపేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రామచంద్ర ప్రభు బ్యాంకు ఖాతా వివరాలను పోలీసులు పరిశీలించారు. సెల్వి అకౌంట్‌కు తరచుగా డబ్బు పంపినట్లు తేల్చారు.

    ఫోరెన్సిక్ రిపోర్ట్స్‌లో కూడా రామచంద్ర ప్రభు ఫుట్ ప్రింట్స్, సెల్వి ఇంట్లో లభించిన ఫుట్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి. దీంతో.. ఈ హత్య చేసింది అతనేనని పోలీసులు నిర్ధారించారు. అరెస్ట్ చేస్తారనే భయంతో రామచంద్ర ప్రభు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. సెల్వితో టచ్‌లో ఉన్న 150 మందిని కూడా పోలీసులు విచారించారు. ఈ నర్స్ కారణంగా చాలా కాపురాలు కుప్పకూలిపోయాయని విచారణలో తేలింది. దాదాపు సంవత్సరం పాటు సాగిన ఈ కేసు విచారణలో ఎట్టకేలకు పోలీసులు అసలు హంతకుడు ఎవరో తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Extra marital affair, Murder, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు