విదేశీ వనితలతో హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్...అనుమానం రాకుండా ఏం చేశారంటే...?

స్పా నిర్వాహకులు థాయ్ ల్యాండ్ నుంచి 10 మంది యువతులతో ముందుగా స్పా ప్రారంభించారు. అయితే స్పా ముసుగున విదేశీ వనితలతో వ్యభిచారం చేయించడమే నిర్వహకులు పనిగా పెట్టుకున్నారు. ఇలా వరుసగా గుట్టురట్టుకాకుండా వ్యవహారం సాగింది.

news18-telugu
Updated: August 18, 2019, 11:13 PM IST
విదేశీ వనితలతో హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్...అనుమానం రాకుండా ఏం చేశారంటే...?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 18, 2019, 11:13 PM IST
నోయిడాలోని 22 మంది విదేశీ యువతులతో వ్యభిచార గృహం నడుపుతున్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. వివారాల్లోకి వెళితే ఇటీవలే నగరంలో ఏర్పాటు చేసిన స్పా సెంటర్ లో విదేశీ యువతులతో మసాజ్ చేయిస్తున్నామని ప్రకటనలు చొప్పించారు. ఇందుకు నగరంలోని యువకులు ఆకర్షితులయ్యారు. స్పా నిర్వాహకులు థాయ్ ల్యాండ్ నుంచి 10 మంది యువతులతో ముందుగా స్పా ప్రారంభించారు. అయితే స్పా ముసుగున విదేశీ వనితలతో వ్యభిచారం చేయించడమే నిర్వహకులు పనిగా పెట్టుకున్నారు. ఇలా వరుసగా గుట్టురట్టుకాకుండా వ్యవహారం సాగింది. దీంతో వ్యాపారం కూడా జోరందుకోవడంతో మరో పది మంది యువతులను థాయ్ ల్యాండ్ నుంచి రప్పించారు. అటు నగరంలో కూడా స్పా సెంటర్ పేరు మారుమ్రోగి పోయింది. హైటెక్ పద్ధతిలో వాట్సప్ ద్వారానే వ్యవహారమంతా నడిచిపోయేది.

నిర్వాహకులు తెలివిగా పైకి వెల్ నెస్ సెంటర్, స్పా అని కలరింగ్ ఇస్తూనే లోపల వ్యభిచారం నడపడం సాగిపోతోంది. అయితే ఇటీవల పోలీసులు ఆపరేషన్ క్లీన్ పేరిట స్పాల ముసుగుగ సాగుతున్న వ్యభిచార ముఠాల గుట్టురట్టుచేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా నోయిడాలోని స్పాలో తనిఖీ చేయగా, దిగ్భ్రాంతి గొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. మొత్తం 22 మంది విదేశీ వనితలు, 10 మంది యువకులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరి హైటెక్ వ్యవహారం చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోవడం విశేషం.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...