వామ్మో... బాత్‌రూంలో సీక్రెట్ కెమెరా... అందులో ఫుటేజ్ చూస్తే...

Crime : ఎక్కడో ఒక చోట కెమెరా పెట్టాలనుకున్నాడు. చివరకు బాత్‌రూంలో పెట్టాడు. దాని వల్ల జరిగిన అనర్థమిది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 10, 2019, 1:52 PM IST
వామ్మో... బాత్‌రూంలో సీక్రెట్ కెమెరా... అందులో ఫుటేజ్ చూస్తే...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: April 10, 2019, 1:52 PM IST
ఇంగ్లండ్‌లోని..... టాంటన్‌లో జరిగిందీ ఘటన. రోజూలాగే... ఆ స్కూల్‌ని క్లీన్ చేస్తున్న పని మనిషి... పనిలో పనిగా అక్కడి బాత్‌రూంని కూడా శుభ్రం చేద్దామని డోర్ తీసి లోపలికి వెళ్లింది. కింద ఫ్లోర్ అంతా శుభ్రం చేశాక... అనుకోకుండా పైకి చూసింది. అక్కడ ఓ మూల ఏదో నల్లగా కన్నంలాగా కనిపించింది. అదేంటా అని చెక్ చేస్తే... ఆ కన్నంలోంచీ ఓ పెన్ను కింద పడింది. ఇదేంటి పెన్ను అక్కడ పెట్టిందెవరు అనుకుంటూ దాన్ని తీసింది. తీరా చూస్తే... అది పెన్ను కాదనీ... సీక్రెట్ కెమెరా అనీ ఆమెకు అర్థమైంది. ఆ స్కూల్‌లో పనిచేసే వాళ్లంతా మహిళా టీచర్లే. ఎవరో కావాలనే ఆ పెన్ కెమెరాను అక్కడ సెట్ చేశారని ఆమెకు అర్థమైంది. వెంటనే స్కూల్ హెడ్ మాస్టర్‌కు దాన్ని ఇచ్చి విషయం చెప్పింది.

క్షణాల్లో ఈ విషయం స్కూల్ మొత్తం తెలిసింది. టీచర్లంతా లెసన్స్ చెప్పడం ఆపేసి... వెంటనే హెచ్ఎం దగ్గరకు వెళ్లారు. ఆ పెన్ కెమెరాలో ఏముందో చూపించాలని డిమాండ్ చేశారు. అక్కడి కంప్యూటర్‌కి దాన్ని కనెక్ట్ చేసి చూశారు. షాకయ్యారు. అందులో చాలా ఫుటేజ్ ఉంది. చాలా వీడియోలున్నాయి. స్కూల్లో టీచర్ల మొదలు, చిన్న పిల్లల వరకూ... ఆ బాత్‌రూంలో స్నానాలు చేసిన వారివి, అందులోకి వెళ్లిన ప్రతి ఒక్కరి విజువల్సూ ఉన్నాయి. కొంతసేపటి వరకూ వాళ్లంతా షాక్‌లో ఉండిపోయారు.


పోలీసులకు కంప్లైంట్ వెళ్లింది. ఎంక్వైరీ చేశారు. ఓ విషయం తెలిసింది. కొన్ని రోజుల కిందట ఆ స్కూల్‌లో ఎలక్ట్రిక్ వర్క్ చేసేందుకు వచ్చాడు 49 ఏళ్ల డారిన్. అతను ఆ రోజు బాత్‌రూంలోకి కూడా వెళ్లినట్లు ఒకరిద్దరు టీచర్లు చెప్పారు. వెంటనే అతని ఇంటికి వెళ్లి రైడ్స్ చేశారు. ఆ ఇంట్లో చాలా రకాల రహస్య కెమెరాలున్నాయి. వందల కొద్దీ బ్లూ ఫిల్మ్, బూతు బొమ్మలు రకరకాలున్నాయి. చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు కూడా ఉండటంతో... ఆ కేటుగాడు ఇంకా ఏయే స్కూళ్లు, షాపింగ్ మాళ్లలో కెమెరాలు పెట్టాడో విషయం రాబట్టారు. అక్కడకు కూడా వెళ్లి, అన్ని సీక్రెట్ కెమెరాల్నీ తొలగించే పని మొదలైంది.

ఇంగ్లండ్ చట్టాల ప్రకారం... డారిన్‌కి మాగ్జిమం ఐదేళ్లు మాత్రమే శిక్ష పడుతుందంట. మనం ఎలాగైతే ఆ శిక్ష చాలదని అంటుంటామో... అక్కడి వారు కూడా అతనికి ఇంకా పెద్ద శిక్ష వెయ్యాలని కోరుతున్నారు. 

ఇవి కూడా చదవండి :

అయ్యబాబోయ్... రూ.2,00,00,000... లారీలో సిమెంట్ బస్తాల్లో దాచి... ఏలూరుకు...

కావేరీ ట్రావెల్స్ ఎందుకలా చేసింది... జనం ఓట్లు వెయ్యకుండా కుట్ర జరుగుతోందా

ఐసీసీ వరల్డ్ కప్ టీమ్స్ ఎప్పుడు ప్రకటిస్తారు... టైమ్ లైన్ ఇదిగో...

ఇంటర్నెట్ ఓటింగ్ తెచ్చేదెప్పుడు... ఎంతసేపూ పాత పద్ధతేనా... మనోళ్లు మారరా...
First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...